12 మంది భారతీయులతో సహా 17 మంది దుర్మరణం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ని దుబాయిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు దుబాయి పోలీసులు వెల్లడించారు.