ఢిల్లీ పోలీసు చార్జిషీటు స్పష్టీకరణ
న్యూఢిల్లీ : రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషన్ శరణ్ గడచిన దశాబ్దకాలంగా వివిధ సమయాల్లో, పలు ప్రాంతాలలో పలువురు మహిళా రెజ్లర్లను వేధించారని, ఆయన విచారణకు అర్హుడని, ఆయన చేసిఇన తప్పలకు ఆయన శిక్షార్హుడని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటు స్పష్టం చేసింది. “ఆయనను విచారణ చేయాల్సిన అవసరం ఉంది, ఆయన చేసిన తప్పులకు శిక్షార్హుడు, రెజ్లర్ల శరీరభాగాలపై చేతులువేసి వేధించారని ఢిల్లీ నగర న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది. బ్రిజ్ భూషణ్‌పై ఆరుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదులు చేశారు. పోలీసులు వారిని తిరిగి ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్ళి సీన్ రీ క్రియేట్ చేసిమరీ సాక్ష్యాలు నమోదు చేశారు. రెజ్లర్లు సమర్పించిన వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఎసిఎంఎం) హర్‌జీత్ సింగ్ జస్పాల్ ఇంతకుముందు వివిధ సెక్షన్ల కింద బ్రిజ్ భూషణ్‌పై నమోదు చేసిన కేసులను పరిగణనలోకి తీసుకున్నారు. భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 354 (బలాత్కారం), 354ఎ (లైంగికపరమైన అర్థంలో వ్యాఖ్యలు చేయ డం), సెక్షన్ 354డి (వెంటే తిరుగుతూ వేధించడం), 506 (నేరపూరిత దురుద్దేశం), 109 (బలవంతంగా దాడియత్నం) కేసులు పెట్టారు. కోర్టు బ్రిజ్ భూషణ్‌కు ఇచ్చిన సమన్ల ప్రకారం, ఆయన ఈనెల 18న మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణా ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా కోర్టుకు హాజరుకావాలి. పోలీసులు ప్రాథమింగా వ్యక్తం చేసిన అభిప్రాయాలను న్యాయస్థానం విశ్వసించి వాటిని పరిగణనలోకి తీసుకుంది. ఈనెల 7వ తేదీన ఢిల్లీ కోర్టు మైనర్ రెజ్లర్ తన పిటిషన్ ఉపసంహరణకు అనుమతించింది. బ్రిజ్ భూషణ్ తన రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎంపిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయనపై పోస్కో చట్టం కింద వచ్చిన ఆరోపణలను కూడా తర్వాత కోర్టు విచారణ చేస్తుంది. ఆయన వేధింపులకుసంబంధించి అనేక ఆరోపణలు, ఉదాహరణలు ఉన్నాయి.
అరెస్టు ఎప్పుడు? బిజెపి నుండి బహిష్కరణ ఎప్పుడు?
బ్రిజ్ భూషణ్‌పై చార్జిషీటు దాఖలు చేయడం, కోర్టు దానిని పరిగణనలోకి తీసుకోవడంతో కాంగ్రెస్‌పార్టీ మంగళవారం బిజెపిపై తీవ్ర విమర్శల చేసింది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధిపులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాటించిన మౌనాన్ని కాంగ్రెస్‌పార్టీట అధికార ప్రతినిధి సుప్రియా ష్రినాటే ప్రశ్నించారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన భారతీయ కుమార్తెలనుండి పెద్ద పరీక్ష ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఆయన పదవీ కాలం పూర్తి అవుతోంది. ఆయన్ను ఎప్పుడు అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించింది. ఢిల్లీ పోలీసులు జూన్ 15వ తేదీన బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా చార్జిషీటు దాఖలు చేశారు. ప్రధానమంత్రి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఇక ఎప్పుడు బ్రిజ్ భూషణ్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తారని ఆమె ప్రశ్నించారు.
దశాబ్దకాలంగాబ్రిజ్ భూషణ్ వేధింపులు
RELATED ARTICLES