ప్రజాపక్షం / హైదరాబాద్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసిం ది. ఈ మేరకు ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ సోమవారం నాడు జిఒ 114ను జారీ చేశారు. ఈ నిధులను తెలంగాణ ఎస్‌సి కులాల సహకార ఆర్థిక కార్పొరేషన్ చెక్కు రూపంలో కరీంనగర్ జిల్లా ఎస్‌సి సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఖాతాకు వెంటనే బదిలీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ ‘దళితబంధు’ పథకంఅమలు చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం కింది ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూర్చనున్నారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారం వాసాలమర్రి దళితుల కోసం దళిత బంధు పథకం కింద రూ. 7.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
‘దళితబంధు’కు రూ. 500 కోట్లు విడుదల
RELATED ARTICLES