సూచీలపై ప్రభావం చూపిన ఎన్నికలు
ముంబయి : ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మార్కెట్ సూచీలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దీంతో భారత మార్కెట్లు గురువారం నేల చూపులు చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీన పడటం తదితర అంశాలు మార్కెట్లను తీవ్రంగా నష్టాల్లోకి చేర్చాయి.. దీనికి తోడు ఆటోమొబైల్, లోహ, ఆర్థిక, వినియోగ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు కూడా సూచీలను కుదిపేశాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 570 పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 180 పాయింట్లు పడిపోయింది. గురువారం మార్కెట్ ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 10,700 దిగువన ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నానికి కాస్త కోలుకున్నట్లే కనిపించినా.. చమురు ఉత్పత్తి, సరఫరాపై నేడు జరగబోయే ఓపెక్ సమావేశం, శుక్రవారం సాయంత్రం వెలువడబోయే రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు మరింత నష్టాన్ని చవిచూశాయి. గురువారం సెన్సెక్స్ 572 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు దిగజారి 10,601 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.82గా కొనసాగుతోంది.
దలాల్ స్ట్రీట్ ఢమాల్
RELATED ARTICLES