న్యూ ఢిల్లీ: ప్రొకబడ్డీ ఏడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ వరుస విజయాలతో దూసుకు పోతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లో మూడింటిలోనూ విజయం సాధించి 15 పాయింట్లతో పట్టికలో అగ్రభాగాన నిలిచింది. ఆదివారం హర్యానా స్టీలర్స్‌తో జగిన మ్యాచ్‌లో 41 పాయింట్లతో స్టీలర్స్‌ను చిత్తు చేసి విజయ ఢంకా మోగించింది. చంద్రన్ రంజిత్(11), నవీన్ కుమార్(10), సయ్యద్ ఘఫారీ(4)లు చెలరేగి ఆడటంతో ఢిల్లీ విజయం సాధించింది. స్టీలర్స్‌లో నవీన్(9), వినయ్(5) పోరాడినా ఢిల్లీ జట్టును ఏ దశలోనూ నిలువరించ లేకపోయారు. దబాంగ్స్ సాధించిన 41 పాయింట్లలో హర్యానా స్టీలర్స్ కనీసం సగం పాయింట్లు సాధించలేక పోయారంటే వారి ఆటతీరు అర్ధం చేసుకోవచ్చు. కాగా, ఢిల్లీకిది ఈ సీజన్ హ్యట్రిక్ గెలుపు.
దబాంగ్ ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం
RELATED ARTICLES