ఆ ప్రాజెక్టుల పరిపూర్తిపై దృష్టి సారించండి
సిఎం కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ : దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ దృష్టి సారించాలని సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండ పోచమ్మ సాగర్‌ను ప్రారంభించడం అభినందనీయమని, దీంతో దాదాపుగా ఉత్త ర తెలంగాణకు సంబంధించిన సాగునీటి అవసరాలు తీరనున్నాయన్నారు. అయితే, కృష్ణా జలాల ఆధారంగా ఉన్న దక్షిణ తెలంగాణ ప్రా జెక్టులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. మరోవైపు ఇటీవల పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఎపి ప్రభుత్వం జిఒ జారీ చేసిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నా రు. ముఖ్యంగా ఎస్‌ఎల్‌బిసి నిర్మాణం దశాబ్దాలుగా కొనసాగుతూ, తెలంగాణలో వచ్చాక కూడా అదే పరిస్థితి ఉండడం మంచిది కాదని సూ చించారు. అలాగే పాలమూరు- ప్రాజెక్టు విషయంలో నీటి వాటా తగ్గింపు, డిండి, కల్వకుర్తి తదితర ఎత్తిపోతల విషయంలో అస్పష్టత కొనసాగుతున్నదన్నారు. ఎగువన కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్న నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని , సూచనలు స్వీకరించాలని శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రూ.1500 కొనసాగించాలి, ఉద్యోగులకు పూర్తి వేతనాలివ్వాలి
కరోనా మూలంగా ప్రజలను కష్టాల్లోకి నెట్టి ప్రభు త్వం ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని చాడ వెంకట్‌రెడ్డి వి మర్శించారు. గత రెండు నెలలుగా, అలాగే ఈ నెల కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలలో 50 శా తం కోత విధించడం, చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలలో 10 శాతం కోత విధించడం అన్యాయమన్నారు. పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్‌లో కోత విధించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వారి పెన్షన్ల నుండి 25 శాతం కోత విధించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇలా ప్రభుత్వమే కోతలు విధిస్తే ప్రైవే టు, అసంఘటిత రంగంలో పని చేసే వారి వేతనాల కు నిస్సందేహంగా మరింత కోతలు పడతాయన్నా రు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్ర ఇ బ్బందులకు గురైంది వలస కార్మికులని, అనేక ఆర్థిక చిక్కులను ఎదుర్కొంటున్నది అసంఘటితరంగ కార్మికులని, నిరుపేదలు పడిన బాధలను గుర్తించకపోవ డం బాధాకరమన్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేలాగా ప్రత్యక్ష నగదు బదిలీ ఉండాలని ఆశించిందని చాడ గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అ లాంటిదేమీ ఆర్థిక ప్యాకేజీలో కొత్త ప్రకటించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని భావించామని, అందు కు భిన్నంగా గత రెండు నెలలుగా రేషన్ కార్డుదారులకు ఇస్తున్న రూ. 1500 ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించ డం విస్మయానికి గురి చేసిందన్నా రు. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి వేతనాలు, పెన్షనర్‌లకు పూర్తి పెన్షన్ చెల్లించాలని కోరారు.