బహిరంగ చర్చకు సిద్ధమా!
సిఎం, టిఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ సవాల్
ప్రజాపక్షం / హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షపై బహిరంగ చర్చకు సిఎం కెసిఆర్ లేదా టిఆర్‌ఎస్ నేతలు సిద్ధమా అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఏ చల్లా వంశీచంద్‌రెడ్డి సవాలు విసిరారు. స్వయంగా కెసిఆర్ స్పందించినా పర్వాలేదని లేదా మంత్రులు, జిల్లాల వారీగా టిఆర్‌ఎస్ నేతలను పంపినా పర్వాలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి పంపు హౌజ్‌ను ఉపరితలంపై కాకుండా అండర్ గ్రౌండ్‌లో నిర్మించేలా రీడిజైన్ చేయడంలో సిఎం కుటుంబసభ్యులకు ఎవరెవరికి ఎంత వాటాలు ముట్టాయో ఆధారాలతో సహా బైటపెడతానని ప్రకటించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాధే, నీళ్ళు, నిధులు, నియామకాలని, సిఎం కెసిఆర్ అసమర్ధ, నియంతృత్వ, అహంకార పాలనలో నీళ్లు ఆంధ్రోళ్లకు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు, నియామకాలు కెసిఆర్ ఇంటి పాలైతున్నవని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. కెసిఆర్ అహంకారం, అంతా తనకే తెలుసుననే భావన కారణంగా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ద్వారా తెలంగాణను ఎడారిగా మార్చి రాయలసీమను రతనాలసీమగా మార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనతో బహిరంగ చర్చకు అంగీకరిస్తే దక్షిణ తెలంగాణలో కృష్ణా ప్రాజెక్టులకు నీ ళ్ళు రాకుండా ఏడారిగా చేస్తున్న ప్రభుత్వ విధానాలను వివరిస్తానని, సిఎం కుటుంబ సభ్యుల వాటా గురించి బైటపెడతానని అన్నారు.
సిఎం గారూ.. వీటికి సమాధానమివ్వండి..
దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్ అవలంభిస్తున్న వైఖరి, పాలమూరు పథకం విషయంలో తడవకో మాట మాట్లాడడంపై మీడియా సమావేశంలో వంశీచంద్‌రెడ్డి కొని ప్రశ్నలను కెసిఆర్‌కు సం ధించారు. వాటికి సమాధానాలివ్వాలని డిమాండ్ చేశారు. అందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలివే..
F పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు 2005 పెంచినప్పు డు కేంద్ర మంత్రిగా ఉన్న కెసిఆర్, నరేంద్ర, రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్న ఆరుగురు టిఆర్‌ఎస్ మంత్రులు పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదు?
F ఆంధ్ర వారు మన కృష్ణా బేసిన్ నీళ్ళను కృష్ణేతర బేసిన్లకు తరలించుకుపోతుంటే ఎందుకు ఉద్యమించలేదు?
F గతంలో సామర్థ్యం పెంచినప్పుడు పాత పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చినప్పటికీ, కెసిఆ ర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా పాత 4 తూములు ఎందుకు మూయించలేదు? దీంతో పాతవి నాలు గు, కొత్తవి 10తూములు కలిపి 70వేల క్యూసెక్కుల నీరు ఎపి తరలించుకుపోవడం లేదా?
F ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డి పాడు, రాయలసీమ ఎ త్తిపోతల పథకం పేరుతో ఎపి ప్రభుత్వం జిఒ 203 విడుదల చేస్తే, సిఎం స్పందించడానికి వారం రోజులు ఎందుకు పట్టింది?
F పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రి మీటర్లను ఎందుకు పెట్టించలేకపోయారు?
F బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా నదిపై వరదలు వచ్చే రోజులు 60 నుండి 30 రోజులకి తగ్గించిన తరువాత కూడా తెలంగాణలో 60 వరద రోజుల ఆధారంగా ఎందుకు ప్రాజెక్టుల రూపకల్పన చేశా రు? పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11000 నుంచి 44000 పెంచిందే వరద దినాలు 45 నుంచి 30కి తగ్గినందుకు కదా? ఈ విషయంలో మీ తెలివి ఏమైంది.
F కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో GO 72 ద్వారా జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే దాన్ని తుంగలో తొక్కడం మీ అహంకారం కాదా?
F కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకు రోజు 3 టిఎంసిల చొప్పున ఎత్తిపోస్తూ రూ. 32,200 కోట్లతో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ద్వారా డిపిఆర్ తయారు చేయించి ఎందుకు పక్కన పెట్టారు?
F పాలమూరు- ఎత్తిపోతల ద్వారా వ్యవసాయానికి -120, తాగునీటికి – 20, పరిశ్రమలకు టిఎంసిలు కలిపి మొత్తం 145 టిఎంసిలు అవసరమని, అయితే జిఒ 105లో కేవలం 90 టిఎంసిలే అని ఎందుకు పేర్కొన్నారు?
F టిఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ నాయకులాంతా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఒకటి ఎంసి పెంచి మూడు టిఎంసిలలు కేటాయించాలని కెసిఆర్‌కు 2016 ఫిబ్రవరి 22న లేఖ రాస్తే ఎందు కు స్పందించలేదు?ఆ తరువాత రెండు టిఎంసిలు కూడా ఒక్క టిఎంసికి తగ్గిస్తే టిఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు? మీకు తెలివిలేదా? మహబూబ్‌నగర్ నాయకులకు తెలివిలేదా?
F డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు- ఎత్తిపోతలతో సంబంధం లేకుండా నీళ్ళు కేటాయిస్తామని కెసిఆర్ నిండు శాసనసభలో 2015 మార్చి 31న చెప్పారని, ఆ తరువాత పాలమూరు పథకంలోనే భాగమైన నార్లాపూర్ నుంచి నీటి కేటాయింపునకు 2016 సెప్టెంబర్ 24న జిఒ 806 విడుదల చేయడంలో మర్మమేమిటి?
F ఇరిగేషన్ నిపుణులందరు వ్యతిరేకించినా పాలమూరు- లోని ఉపరితల పంపు హౌస్ డిజైన్ మార్చి భూగర్భ పంపు హౌస్‌కి మార్చలేదా? ఇది మీ కాసుల కక్కుర్తి కోసం కాదా?
F సిఎం కెసిఆర్ శాసనసభలో 2016 మార్చి 31న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు హామీ ఇచ్చిన 20 టిఎంసిల రిజర్వాయర్లు ఎక్కడ మాయమయ్యాయి?
F ‘జూరాల నుంచి పాకాలకు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను చీల్చుకుంటూ గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోవొచ్చు. జూరాల- కట్టి తిరుతం” అని సిఎం కెసిఆర్ శాసనసభలో హామీ ఇచ్చి, 2014 ఆగస్టు 2వ తేదీన జిఒ కూడా విడుదల చేసి ఎందుకు వెనక్కి పోయారు? శాసనసభలో హామీ ఇచ్చినప్పుడు మీ తెలివి ఏమైంది? గ్రావిటీ కన్నా లిప్టుల ద్వారానైతే ఎక్కువ కమిషన్లు వస్తాయ నా?
F కెసిఆర్ తరచుగా మాట్లాడే ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులు మొత్తానికే ఎందుకు ఆగిపోయినవి?
F కల్వకుర్తి , పాలమూరు డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లు, తుమ్మిళ ప్రాజెక్టులు స్వయంగా తానే కు ర్చీ వేసుకొని కట్టిస్తా అని సిఎం కెసిఆర్ అన్నారని, మరి ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలి? సమ యం లేదా? కుర్చీ దొరకలేదా?