HomeNewsBreaking Newsదక్షిణాసియా వర్సిటీలో విద్యార్థుల నిరాహారదీక్ష విరమింపజేయండి

దక్షిణాసియా వర్సిటీలో విద్యార్థుల నిరాహారదీక్ష విరమింపజేయండి

విదేశాంగమంత్రికి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్‌
న్యూఢిల్లీ :
స్కాలర్‌ షిప్‌లకోసం న్యూఢిల్లీలోని దక్షిణాసియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్ష సమస్య ను పరిష్కరించాలని, ఆ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాజా మంత్రికి లేఖ రాశారు. నిరాహార దీక్ష కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆసుపత్రిపాలయ్యారని ఆయ న ఆ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయం అయినందువల్ల తీవ్ర పరిణామాలు ఎదురుకాకముందే సమస్యలో జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరారు. తక్షణ ప్రాతిపదికపై సమస్య పరిష్కరించకపోతే,యాజమాన్యం తప్పిదాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు సంభవవిస్తాయని,పొరుగుదేశాల్లో భారత ప్రతిష్టకు భంగం కలుగుతుందని రాజా హెచ్చరించారు. “స్కాలర్‌షిప్‌లకోసం నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులందరి పరిస్థితి ఆరోగ్యపరంగా క్షీణించింది, చాలామంది ఆయుస్థానాలు ఆందోళనకరస్థాయిలో క్షీణించిపోయాయి, వారిని ఆసుపత్రిలో చేర్చారు, వారి స్కాలర్‌షిప్‌ డిమాండ్లు పరిష్కరించండి” అని డి రాజా ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. “విద్యార్థులు, మానసికంగా, శారీకరంగా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, తక్షణ ప్రాతిపదికపై స్పందించి వారి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది, అప్పుడే వారి నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది, అందుకే ఈ లేఖ రాస్తున్నాను” అని రాజా పేర్కొన్నారు. “విశ్వవిద్యాలయం విద్యార్థులు కేవలం కనీస స్కాలర్‌షిప్‌ మాత్రమే కోరుతున్నారు, మాస్టర్స్‌ విద్యార్థులకు ఐఎన్‌ఆర్‌ స్టుఫైండ్‌ రూ.7,000 వంతున ఇవ్వాలని అడుగుతున్నారు, వీరంతా సమాజంలో అణగారిన వర్గాల నుండి వచ్చినవారే” అని లేఖలో తెలియజేశారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లలో భారీగా కోత విధించారని విమర్శించారు. పిహెచ్‌డి స్కాలర్స్‌కు ఇవ్వాల్సిన జెఆర్‌ఎఫ్‌ స్టయిఫెండ్‌ ఇవ్వట్లేదని, ఏడాదికాలంగా వాయిదా వేశారని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో సార్క్‌ దేశాల సహకారంలో ఈ దక్షిణాసియా విశ్వవిద్యాలయం 2010లో ఢాకాలో జరిగిన 13వ సార్క్‌ సమావేశంలో ఆవిర్భవించిందని రాజా ఆ లేఖలో గుర్తు చేశారు. వివిధ రంగాలకు చెందిన కోర్సుల్లో ఈ యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సార్క్‌ దేశాల విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ఈ విధమైన విలక్షణతగల అంతర్జాతీయ ప్రాముఖ్యంగల విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ సమగ్రతకు ప్రాణంపోసేవిధంగా సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరారు. ఈ విశ్వవిద్యాలయం సక్రమంగా పనిచేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కమిటీ, సమస్యల పరిష్కార కమిటీ, లైగింక వేధింపులకు వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వ కమిటీ వంటి కమిటీల బాధ్యులు, విద్యార్థులు ఈ నిరాహార దీక్షలో ఉన్నారు.శాంతియుతంగా విద్యార్ధులు గాంధేయ పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారని, యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులను పిలవాలని ఆలోచించిందని, శాంతిభద్రతల విభాగం జోక్యం చేసుకుంటే అది భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారుతుందని, పొరుగుదేశాల దృష్టి పడుతుందని ఆయన హెచ్చరించారు. యాజమాన్యం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోందని ఆ లేఖలో ఆయన విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments