సైనా, శ్రీకాంత్‌పైనే అందరి దృష్టి
నేటి నుంచి థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్ : ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ల ఒలింపిక్స్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండేళ్ల క్రితం వరుస పతకాలతో దూసుకుపోయిన ఈ స్టార్ షట్లర్లు గతేడాది నుంచి దారుణంగా విఫలమవుతున్నారు. ఈ ఏడాది కూడా మలేసియా మాస్టర్స్, ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీల్లోను ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగి విఫలమయ్యారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం టాప్-16లో ఉన్న ప్లేయర్లలో ఒక్కో దేశం నుంచి కేటగిరికి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. అయితే ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం సైనా 22, శ్రీకాంత్ 23వ స్థానంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఏప్రిల్ 26 కటాఫ్ కాగా.. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం సింధు, ప్రణీత్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ మాత్రమే రేసులో ఉన్నారు. సైనా, శ్రీకాంత్ టోక్యోకు వెళ్లాలంటే కటాఫ్ తేదీలోపు జరిగే పది టోర్నమెంట్‌ల్లో కనీసం ఆరింటీలో సెమీఫైనల్‌కు చేరాలి. ఇప్పటికే ఇందులో రెండు టోర్నీల్లో ఓడిన సైనా, శ్రీకాంత్… ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా ప్రిపేర్ అ వుతున్నారు. దీనికోసం బ్యాడ్మింటన్ లీగ్ నుంచి తప్పుకున్న సైనా, శ్రీకాంత్ నేటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీకి సమాయత్తం అవుతున్నారు. కఠోర సాధన చేస్తూ ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుంటున్నారు. సమీర్ వర్మ, ప్రణయ్ కూడా ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. డెన్మార్క్‌కు చెందిన లైన్ హజ్మార్క్‌తో జరిగే తొలి పోరుతో సైనా థాయ్‌లా్‌ండ మాస్టర్స్ టోర్నీని ప్రారంభించనుంది. ఈ ఇద్దరి ముఖాముఖిలో 4-0తో సైనానే ముందంజలో ఉంది. ఇక శ్రీకాంత్ ఇండోనేషియా ప్లేయర్ శేసర్ హిరెన్ రుస్తవిటోతో తలపడనున్నాడు. ఇక ఈ టోర్నీలో సమీర్ వర్మ మలేషియాకు చెందిన లీ జి జియతో అమీతుమీ తేల్చుకోనుండగా.. ప్రణయ్ మలేషియాకే చెందిన లుయి డారేన్‌తో ఆడనున్నాడు.
థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో రాణించేనా?
RELATED ARTICLES