సునీల్ ఛెత్రీ రెండు గోల్స్, ఎఎఫ్‌సి ఆసియా కప్
అబుధాబీ: ఎఎఫ్‌సి ఆసియా కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 4 గోల్స్‌తో థాయ్‌లాండ్‌పై ఘన విజయం సాధించింది. భారత సారథి సునీల్ ఛెత్రీ రెండు గోల్స్‌తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన సునీల్ ఛెత్రీ తన ఖాతాలో (66వ) గోల్ వేసుకున్నాడు. అర్జెంటీనా స్టార్ మెస్సీ (65 గోల్స్)ను అధిగమించాడు. ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున సునీల్ చైత్రీ (27వ), (46వ) నిమిషాల్లో వరుసగారెండు గోల్స్ సాధించగా.. అనిరుధ్ థాప (46వ), జిజె లల్‌పేకుల (80వ) సిమిషంలో చెరొక్క గోల్స్ చేశారు. ఇక థాయ్ లాండ్ జట్టు తరఫున నమోదైన ఏకైక గోల్స్‌ను ఆ జట్టు కెప్టెన్ తీరసిల్ దంగ్‌డా (33వ) నిమిషంలో నమోదు చేశాడు.
థాయ్‌లాండ్‌పై భారత్ విజయం
RELATED ARTICLES