సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తాం
నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన
నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని
ఎంఎల్ఎలకు సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్ త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎంఎల్ఏలకు సూచించారు. జిల్లాల వారీగా సమీక్షల్లో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి కసితో పనిచేస్తారన్నారు. బిఆర్ఎస్ లే క పోతే తెలంగాణకు అన్యాయం చేయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుకుంటున్నారన్నారు.
బిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం అభివృద్ధి జరిగినా బిఆర్ఎస్కు వ్యతిరేక ఫలితాలే వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అనేక హామీలను ఇచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ లోపు ఆరు గ్యారంటీలను అమలు కాకపోతే ప్రజలే కాంగ్రెస్ను నిలదీస్తారని చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ .పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ బిఆర్ఎస్కు పునర్ వైభవం వస్తుందన్నారు.
త్వరలో ఇందిరమ్మ కమిటీలు
RELATED ARTICLES