HomeNewsBreaking Newsత్వరలోనే ఉద్యోగులకు ఐఆర్‌

త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్‌

కొత్త పే రివిజన్‌ కమిషన్‌ను నియమిస్తాం
పీటముడిగా మారిన ఒపిఎస్‌పై హామీ ఇవ్వబోం
సింగరేణి ఉద్యోగులకు రూ.100 కోట్ల దసరా, దీపావళి బోనస్‌
నెలరోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తాం
పంచాయతీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం సమంజసం కాదు
‘రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతి’పై స్వల్పకాలిక చర్చలో సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌
గత ఎన్నికల కంటే ఈ సారి నూటికి నూరు శాతం 7, 8 సీట్లు ఎక్కువగానే గెలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదన్నారు. త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తామని, అలాగే నూతన పే రివిజన్‌ కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించారు. అయితే పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌) పీటముడిగా మారిపోయిందని, దానిపై బాధ్యతారహితంగా మామీ ఇవ్వబోమని, ఎలా చేయాలో చూస్తామన్నారు. సింగరేణి ఉద్యోగులకు సెప్టెంబర్‌ , నవంబర్‌ నెలలో రూ.1000కోట్లు దసరా, దీపావళి బోనస్‌గా ఇస్తామన్నారు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తామని, గ్రూప్‌-2, ఇతర పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు తామే వేతనాలు పెంచామని, ప్రతి నెలా జీతాలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్ని, ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు కోరడం సమంజసం కాదని, సమస్యల ఉంటే పరిష్కరిస్తామన్నారు. అసైన్‌మెంట్‌ భూముల అమ్మకానికి సంబంధించి ఎపి తరహాలో జివొ ఇచ్చే అంశాన్ని దళిత ఎంఎల్‌ఏలు, ఎంపిలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో పట్టాలు ఇచ్చినా ఇళ్ళ స్థలాలు లేవని, ప్రస్తుతం అలాంటి వారికి స్థలాలు చూపించి , తరువాత ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్లకు ఫెసఫ్‌గా పట్టాలు ఇస్తామన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో “రాష్ట్ర ఆవిర్భావం- సాధించిన ప్రగతి”పై స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చకు సిఎం కెసిఆర్‌ సమాధానమిస్తూ 2001తో టిఆర్‌ఎస్‌ ఏర్పాటుకు పూర్వరంగం, టిఆర్‌ఎస్‌ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు తరువాత తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి వివరించారు. సాగు నీరు, తాగునీరు, వ్యవసాయం సహా వివిధ అంశాలపై సుమారు రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా ప్రసంగించారు. అతి త్వరలో సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సంగమేశ్వర-బసవేశ్వర, నాగమడవలో పూర్తికానున్నాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వరి ధాన్యం దిగుబడి 68లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటే, ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్‌ టన్నలకు పెరిగి పంజాబ్‌ను తలదన్నేలా ఉన్నదన్నారు. ధాన్యం దిగుబడిని కూడా 4 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పెంచబోతున్నామని ప్రకటించారు. వట్లెం, కరివెన , ఏదుల, కరివెన, ఉద్దండపూర్‌ జలాశయాలను త్వరలో నింపబోతున్నామని చెప్పారు.
తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీపై సిఎం కెసిఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ అని, నాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే నెహ్రూ అని అన్నారు. ప్రతి సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ ఏదో రకంగా వంచించడంతో తెలంగాణ ఆరు దశాబ్దాలను కోల్పోయిందన్నారు. చివరకు 2014లో ఎన్నికల ముందు దేశమంతా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న సమయంలో తెలంగాణలోనైనా కనీసం 10 సీట్లు వస్తాయనే ఒత్తిడితో తెలంగాణ ఇచ్చారని, ముందు నుండే తెలంగాణ కొనసాగి ఉంటే ఎప్పుడో సకల అష్ట ఐశ్వర్యాతో తలతూగేదన్నారు. ఉద్యమ సమయంలో రేణుకా చౌదరి తెలంగాణ ఇన్‌స్టెంట్‌ కాఫీనా, దోసానా అడగగానే ఇచ్చేందుకు అన్నారని, వైఎస్‌ తాను నంద్యాల ప్రచారానికి వెళ్ళి తెలంగాణకు వెళ్తే వీసా కావాలా? అని అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే అంధకారంలో ఉన్న తొమ్మిదేళ్ళలో తెలంగాణను సుస్థిర ఆర్థిక ప్రగతి సాధించిన స్థితిలో, అనేక పథకాలు అమలు చేస్తూ, నిరంతర విద్యుత కల్పిస్తూ ఒక పద్ధతిలో తీసుకుపోతుంటే, కాంగ్రెస్‌ నేతలు మాత్రం కెసిఆర్‌కు పిండం పెడతామంటున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చేసినందుకు పిండం పెడతారా? అని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పిండం పెడతారో చూద్దామన్నారు. టిపిసిసి అధ్యక్షుడు వ్యవసాయానికి 3 గంటలే ఉచిత విద్యుత్‌ ఇస్తానంటున్నానడి, మీరు గెలిచేది లేదు సచ్చేది లేదన్నారు.
అవి అలవిమాలిన మామీలు.. మా అమ్ములపొదిలో అస్త్రాలు ఉన్నాయి
ప్రజలుకు ఏమైనా చేస్తే రేవిడీ కల్చర్‌, ఉచితాలు అని బిజెపి అంటుందని, కర్నాటకలో మాత్రం మళ్ళీ గెలిస్తే ఇంటికి అరలీటర్‌ పాలిస్తామని అదే పార్టీ చెప్పిందని సిఎం కెసిఆర్‌ ఎద్దేవా చేశారు. ఇటీవల ఖమ్మం సభలో కూడా రూ.4వేల పెన్షన్‌లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కర్నాటక ఎన్నికలలో అలవిమాలని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు డబ్బులు లేవని , ఎస్‌సి ఫండ్‌ను హామీల కోసం మళ్ళించాలని కర్నాటక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పారు. తాము మాత్రం చేయగలిగేవే చెప్తామని, చెప్పిందే చేస్తామని అన్నారు. నాలుగు ఓట్ల కోసం అలవిమాలిన హామీలు ఇవ్వబోమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రూ.2లక్షల రైతు రుణమాఫీ అంటే, తాము మాత్రం రూ.1 లక్ష మాత్రమే చేస్తామని చెప్పిన 81 మందిని గెలిపించారన్నారు. అదే సమయంలో తాము కూడా పెన్షన్‌లను తప్పకుండా పెంచుతామని, ఒక్కసారిగా కాకుండా క్రమానుగతంగా పెంచుతామని హామీ ఇచ్చారు. మా దగ్గర గంపెడు ఉన్నవి, మా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నవి, ఒక్కొక్కటి తీస్తామని, వాటిని తీసినప్పుడు ప్రతిపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయన్నారు.
మజ్లిస్‌ మా మిత్రపక్షమే
”మమ్మల్ని కొందరు బిజెపి బి టీమ్‌ అంటున్నారు. ఎంఐఎంను కూడా బిజెపి బి టీమ్‌ అంటున్నారు. అది మొదటి నుండి ముస్లింల సంక్షేమం కోసం పాటు పడుతున్న పార్టీయని అన్నారు. తమ పార్టీని బిజెపి బి టీమ్‌ అన్న శరద్‌ పవారే బిజెపిలోకి జొర్రారని అన్నారు. మజ్లీస్‌ పార్టీ మాకు ఎప్పుడైనా మిత్ర పక్షమే. భవిష్యత్‌లోనూ ఎంఐఎంనుర కలుపుకొని పోతామని’ కెసిఆర్‌ అన్నారు.
తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం.. అవార్డులు మాత్రం ఇచ్చింది
”ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి 20వేల లీటర్ల మంచినీరు ఇస్తున్నాం. గ్రావిటీతోనే వేలాది గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నాం. పల్లెలు, పట్టణాల్లో రపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నాం. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్‌ భగీరథను అధ్యయనం చేస్తున్నాయి. పారిశుద్ధ్యం, మంచినీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చింది. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చింది. తండాలు, గిరిజన ఆవాసాల్లో రోగాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు? దేశంలోనే వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో 35వేల చెరువులు అదృశ్యమయ్యాయి.
సమ్మిళిత అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
‘ఇప్పుడు మన తలసరి ఆదాయం రూ.3.12లక్షల ఉంటే.. మనం ఏ రాష్ట్రం నుంచి మనం విడిపోయామో.. ఎవరైనా మనల్ని ఎకసెక్కాలు పలికారో.. మీకు పరిపాలన రాదు అన్నరో వారి తలసరి ఆదాయం రూ.2.19లక్షలు. రెండురాష్ట్రాల మధ్య రూ.లక్ష వరకు తేడా ఉంది. ఏపీ, తెలంగాణ పదేళ్ల కింద వచ్చిన రాష్ట్రాలు. దాన్ని మించి చాలా స్థిరపడి, చాలాబలంగా ఉండి ఆర్థిక రాజధాని ముంబయి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ మోడల్‌ అని దేశాన్ని గోల్మాల్‌ చేసి ప్రధానిని సంపాదించిన గుజరాత్‌ రాష్ట్రం కావచ్చు. ఎప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్లుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మనకన్నా పెద్ద రాష్ట్రాలు. ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రం కావచ్చు. వీటిన్నింటిని తలదన్ని ఎక్కువ మొత్తంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది తెలంగాణలోనే. ఇది అన్నింటికి ఇండికేటర్‌. అన్ని రకాల సమ్మిళితమైన అభివృద్ధి జరిగితేనే ఇది సాధ్యం కాదు. ఏ ఒక్క రంగానికే, ఓ ఒక్క వర్గానికో పనులు జరిగితే కాదు. రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ విజయవంతంగా జరిగింది అనేదానికి సూచిక తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగం’ అని సిఎం కెసిఆర్‌ చెప్పారు. త్వరలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్‌ 25వేల మెగావాట్లకు చేరుతుందన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందే మిషన్‌ భగీరథ పేరు..
తెలంగాణ వస్తే పునర్నిర్మాణం ఎక్కడ మొదలు పెట్టాలని చాలా పర్యాయాలు చర్చలు జరిపాయం. ఆచార్య జయశంకర్‌, విద్యాసాగర్రావుతో చర్చించాం. తెలంగాణ వస్తే ముందుగా చెరువులు బాగు చేసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర ఏర్పాటుకు 5..6 నెలల ముందే మిషన్‌ భగీరథ అని పేరు పెట్టాలని భావించాం. మిషన్‌ కాకతీయ పుణ్యమే 30లక్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్కు నీళ్లు వెళ్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి తీసుకొనేలా ప్రణాళికలు చేశాం. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ. మన పునరావాస గ్రామాలు చూసి కేంద్ర బృందాలు ప్రశంసించాయి. కాలువల్లో ఏడాది పొడుగునా నీళ్లు పారుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 4 సజీవ జలధారలు కాళేశ్వరం వల్లే పారుతున్నాయి.
బండి పోతే బండి.. గుండు పోతే గుండు ఇస్తామన్న వ్యక్తి జాడ లేదు..
వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటాం. హైదరాబాద్లో తీవ్ర నష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేదు. 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ ఇవాళ 27లక్షల టన్నులు వాడుతోంది. మళ్లీ కాంగ్రెస్‌ వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారు. ధాన్యం దిగుమతిలో పంజాబ్ను తెలంగాణ అధిగమిస్తోంది. తొలినాళ్లలోనే 30-40లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించాం. తెలంగాణ గోదాముల్లో ప్రస్తుతం కోటి టన్నులు ధాన్యం ఉంది. వేలం ద్వారా విక్రయించాలని పౌరసరఫరాల శాఖ మంత్రిని ఆదేశించా. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఎఫ్‌ఆర్బీఎంలో కేంద్రం కోత విధించింది. దీంతో ఏటా రూ.5వేల కోట్లు నష్టపోతున్నాయం. కేంద్రం వైఖరి వల్ల ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయాం. ధరణి పుణ్యమా అని 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. రైతు చనిపోయిన వారంలోనే ఆ కుటుంబానికి రూ.5లక్షలు వస్తున్నాయి” అని సీఎం కేసీఆర్‌ వివరించారు.ప్రపంచమంతా ప్రభావం చూపేలా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయి. రాబోయే రోజుల్లో ఎన్ని పథకాల నిధులు పెంచాలో అన్నీ పెంచుతాం” అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.
కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే బషీర్‌బాగ్‌ ఉద్యమం
‘విద్యుత్‌ ఛార్జీలపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్‌గా ఉండి నేను లేఖ రాసాను. తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపేందుకు వస్తే పట్టపగలు ముగ్గురు కాల్పులు జరిపారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. చనిపోయిన వారు సైతం కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలు ఓ మోకా దొరికిందని అందులోకి చొరబడి.. ఓల్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు. అంతకు మించి ఏమీ చేయలేద’ని సిఎం కెసిఆర్‌ అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments