ఒక వికెట్ తేడాతో విండీస్ ఓటమి
షై హోప్ సెంచరీ వృథా
కొలోంబో : వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఒక వికెట్‌తో విజయం సాధించింది. అవిష్క ఫెర్నాండో(50), దిముత్ కరుణరత్నే(52), కుశాల్ పెరీరా(42), తిశారా పెరీరా(32), వానిండు హసరంగా(42)లు చెలరేగడంతో శ్రీలంక తొలి విజయానందుకుంది. ఓటమి ఖాయమనుకున్న తరుణంలో హసరంగా ఆచీతూచీ ఆడుతూ లంకను విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ షైహోప్(115), డ్వారెన్ బ్రావో(39), రోస్టన్ చాస్(41), కీమో పాల్(32)తో రాణించడంతో నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరగులు చేసింది. కాగా, లంక బౌలర్లలో ఇసురు ఉదానే మూడు వికెట్లు పడగొట్టగా.. తిశారా పెరీరా, నువాన్ ప్రదీప్‌లు చెరో వికెట్లు పడగొట్టారు. 289 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన లంక 5 బంతులు మిగిలుండగానే గెలుపును సొంత చేసుకుంది. దీంతో లంక 1-0తో సిరీస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలి వన్డేలో లంక గెలుపు
RELATED ARTICLES