మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదింపు
ప్రస్తుతం విండీస్ 50/1
గయానా: వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ని అంపైర్లు మ్యాచ్‌ని కుదించారు. దీంతో ఇరు జట్లు చెరో 32 ఓవర్లు ఆడనున్నాయి. మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్‌పై కన్నేసింది. అంతకముందు ప్రొవిడెన్స్ స్టేడియంలో జోరున వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యంగా వేశారు. కాగా, ప్రపంచకప్ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్‌లో అంచనాల్ని మించి రాణించిన కోహ్లీసేన… అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌ప్‌లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధావన్ కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు మొత్తం 130 వన్డేలు ఆడి 17 సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో వెస్టిండిస్‌తో వన్డే సిరిస్‌లో శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో కేఎల్ రాహుల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా, మ్యాచ్ ప్రారంభం అయ్యాక 5 ఓవర్లు ఆడిన విండీస్ స్కోరు 9 చేయగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఈ మ్యాచ్ ఆపినట్టు వారు ప్రకటించారు. అనంతరం ప్రారంభంమైన మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుందించగా విండీస్ 12 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్(39), షై హోప్(4)లు క్రీజులో కొనసాగుతున్నారు.
తొలి వన్డేకు వర్షం అడ్డంకి
RELATED ARTICLES