రోగి ద్వారా మరొకరికి సోకిన కొవిడ్ -19
తెలంగాణలో 21కి చేరిన కేసులు
21 కేసుల్లో 20 మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారే
రాష్ట్రంలో సోకింది ఒక్కరికే
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో తొలి ట్రాన్స్‌మిషన్ కేసు నమోదైంది. మొదటి సారిగా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ద్వారా మరొకరికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రంలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు కూడా ఇదే. ఇప్పటి వరకు విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే కరోనా సొకి చికిత్స పొందుతున్నారు. కానీ తొలిసారిగా విదేశాల నుంచి వచ్చిన కరోనా సోకిన వ్యక్తి (పేషెంట్ నంబర్ 14)తో సన్నిహితంగా మెలిగిన అతడి కుమారుడికి (35సం.) కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ తొలి ట్రాన్స్‌మిషన్ కరోనా రోగికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రెండో దశగా పేర్కొంటున్న ఈ తరహాలో రాష్ట్రంలో ఓ కేసు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. అయితే దీనిని స్టేజ్ 2గా చూడలేమని వైద్యారోగ్యశాఖ పేర్కొంటుంది. అయితే చైనాలో, ఇటలీలో రోగితో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా రెండో దశ నుంచి మూడో దశకు చేరి సమూహ వ్యాప్తికి వైరస్ సోకింది. చైనా, ఇటలీలో ఆందోళనకర పరిస్థితికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
తొలి ట్రాన్స్‌మిషన్ కరోనా కేసు
RELATED ARTICLES