381 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. 628 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకే ఆలౌటైపోయింది. దీంతో విండీస్‌కు 381 పరుగులు భారీ విజయం దక్కింది. విండీస్ బౌలర్ రొస్టన్ చేజ్ 8 వికెట్లతో ఇంగ్లాండ్‌ను హడలెత్తించాడు. ఇతని ధాటికి ఇంగ్లీష్ జట్టు (80.4 ఓవర్లలో) 246 పరుగులకు కుప్పకూలింది. నాలుగో రోజే 10 వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ రొరి బర్న్ (84) ఒంటరి పోరాటం చేశాడు. విండీస్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. కరీబియన్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. మరోవైపు మొదటి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేసి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జాసన్ హోల్డర్ (202 నాటౌట్), షేన్ డోవ్‌రిచ్ నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించారు. ఫలితంగా 628 పరుగుల ఆధిక్యం సాధించిన విండీస్ 415/6 పరుగుల వద్ద రెండో ఇనింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. డబుల్ సెంచరీతో చెలరేగిన హోల్డర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తొలి టెస్టు విండీస్ దే..
RELATED ARTICLES