గువాహటి : బర్సపర స్టేడియం వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండగా 6:30 గంటలకే టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. మ్యాచ్‌కు కాసేపటి ముందే వర్షం ప్రారంభమైంది. అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురవడంతో పిచ్ తడిసిపోయింది. మైదానం సిబ్బంది తేమ తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలూ చేసినా పరిస్థితిలో మార్పు కనపడలేదు. మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు టాస్ నెగ్గిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ గువాహటిలో ఆదివారం జరుగనుండగా.. తర్వాతి మ్యాచ్‌లు ఇండోర్ (మంగళవారం), పుణే (శుక్రవారం)లో జరుగుతాయి. గతనెలలో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడిన భారతజట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. రోహిత్ శర్మకు ఈ సిరీస్ నుంచి విరామమిచ్చారు. వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, సంజూ శాంసన్ రిజర్వ్‌కు పరిమితమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌ప్ జరుగనుండటంతో భారత్ తన సన్నాహకాలను ఈ సిరీస్ నుంచే ప్రారంభించింది. మరోవైపు భారత్‌పై అంత మంచి రికార్డులేని శ్రీలంక ఈ మ్యాచ్‌లో లక్కు కలిసి రావాలని కోరుకుంటోంది. ఇటీవలే పాకిస్థాన్ గడ్డపై టీ20 సిరీస్ నెగ్గిన లంకేయులు.. ఆస్ట్రేలియాలో మాత్రం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురయ్యారు. చాలాకాలం తర్వాత వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు జట్టులో స్థానం కల్పించారు. అయితే తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేక పోయాడు.
తొలి టి20 వర్షంతో రద్దు!
RELATED ARTICLES