విండీస్ ఓటమి
సెయింట్ లూసికా: వెస్టిండీస్‌తో ప్రారంభమైన టి20 సిరీస్‌లో ఇంగ్లాంగ్ బోణీ చేసింది. ఇక్కడ జరిగిన తొలి టి20లో ఇంగ్లాండ్ 4 వికెట్లతో విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో టా మ్ కర్రన్ (4/36), బ్యాటింగ్‌లో బైరిస్టో (68; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో ఇంగ్లాండ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1 ఆధిక్యం సా ధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు టామ్ కర్రన్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఇతని ధాటికి ఓపెనర్ షయ్ హోప్ (6) పరగులకే వెనుదిరడగంతో కరీబియన్ జట్టు 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత కుదురుగా ఆడుతున్న హేట్‌మైర్ (14)ను కూడా కర్రన్ ఔట్ చేసి విండీస్‌కు మరో దెబ్బేశాడు. మరోవైపు విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (15; 12 బంతుల్లో 2 సిక్స్‌లు)ను జోర్డన్ పెవిలియన్ పంపి విండీస్‌కు కోలుకోలేనిదెబ్బేశాడు. దీంతో విండీస్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో డారెన్ బ్రావో (28; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), నికొలాస్ పూరన్ (58; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి విండీస్‌ను ఆదుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించడంతో విండీస్ గౌరవప్రథమైన స్కోరు చేయగలిగింది. మరోవైపు బ్రాత్‌వైట్ (0), ఫాబియన్ అలెన్ (8), కెప్టెన్ జాసన్ హోల్డర్ (7) వెనువెంటనే పెవిలియన్ చేరడంతో కరీబియన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ కర్రన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ జోర్డన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే అలెక్స్ హేల్స్ (11) వికెట్ కోల్పోయింది. తర్వాత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జానీ బైరిస్టో అద్భుతమైన బ్యాటింగ్‌తో తమ జట్టును ఆదుకున్నాడు. మరోవైపు జోయ్ రూట్ (0), కెప్టెన్ ఇయాన్ మోర్గన్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం జోయ్ డెన్లీతో కలిసి బైరిస్టో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. ఈ క్రమంలోనే బైరిస్టో 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న బైరిస్టో (68)ను నర్సీ పెవిలియన్ పంపాడు. ఈ సమయంలో జోయ్ డెన్లీ (30; 29 బంతుల్లో 4 ఫోర్లు), సామ్ బిల్లింగ్స్ (18) కీలకమైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ఇంగ్లాండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో షెల్డన్ కట్రెల్ మూడు వికెట్లు తీయగా.. అష్లే నర్స్, హోల్డర్, బ్రాత్‌వైట్ తలో వికెట్ దక్కించుకున్నారు. బ్యాట్‌తో మెరిసిన బైరిస్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 శనివారం జరగనుంది.
తొలి టి20 ఇంగ్లాండ్‌దే..
RELATED ARTICLES