హెచ్‌సిఎ అధ్యక్షుడు అజారుద్దీన్
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగే తొలి ట్వంటీ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. డిసెంబర్ ఆరున ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్ల మధ్య తొలి టి మ్యాచ్ జరుగనుంది. నిజానికి హైదరాబాద్‌లో డిసెంబర్ 11న ఈ మ్యాచ్ జరగాల్సింది. అయితే ఆరున ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. ఇక, అజారుద్దీన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై నిలిచింది. ఇక, అజారుద్దీన్ కూడా ఈ మ్యాచ్‌ను సవాలుగా తీసుకున్నాడు. మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్ల గురించి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఎలాంటి సమస్యలు లేకుండా మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించాడు. డిసెంబర్ ఆరున మ్యాచ్ జరుగుతుండడంతో భద్రత పరమైన సమస్యలు ఎదురు కాకుండా పటిష్ట బందోబస్తు ఉంటుందన్నాడు. దీని కోసం రాష్ట్ర పోలీసులతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సేవలను తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఇక, మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నాడు.
తొలి టి20కి ఏర్పాట్లు
RELATED ARTICLES