నేడు బెంగళూరుతో రాజస్థాన్ ఢీ
పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఇరు జట్లు
జైపూర్: ఐపిఎల్ ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమత మవుతున్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మంగళవారం కీలకపోరు జరుగనుంది. టోర్నీ ప్రారంభమై ఇప్పటికే మూడేసి మ్యాచ్‌లు పూర్తి కాగా ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు గెలుపు రుచి చూడడంలో విఫలమయ్యారు. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. అయినా ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించక పోవడం గమనార్హం. అయితే బెంగళూరు జట్ల నిరీక్షణకు మంగళవారం తెరపడనుంది. రెండు జట్లలో ఏదో ఒకటి తొలి విజయం అందుకోవడం ఖాయం. కాగా, ఆ గెలుపు అందుకునేది ఏ జట్టు అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. కాగా, బెంగళూరుతో పోల్చితే రాజస్థాన్ బాగానే ఆడుతున్నా విజయం మాత్రం అందుకోలేక పోతోంది. అయితే బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో గెలిచి విజయాల బాటలో ప్రయాణించాలని తహతహలాడుతోంది. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. కానీ, విజయాలు మాత్రం అందుకోలేక పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. ఇందులో కూడా ఓడితే రానున్న మ్యాచుల్లో మరింత ఒత్తిడి పెరగం ఖాయం. దీంతో ఇటు రాజస్థాన్, అటు బెంగళూరు విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నా..
ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక ఆటగాళ్లుగా పేరున్న విరాట్ కోహ్లి, డివిలియర్స్, హెట్మియార్, గ్రాండోమ్, మోయిన్ అలీ తదితరులు జట్టులో ఉన్నా బెంగళూరు ఒక్కసారి కూడా గెలుపు రుచి చూడలేక పోయింది. హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా బెంగళూరుకు అవమానకర ఓటమి తప్పలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కిందటి మ్యాచ్‌లో కోహ్లి, డివిలియర్స్, పార్థివ్, మోయిన్ అలీ, శివమ్ తదితరులు ఘోరంగా విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. గ్రాండోమ్ కాస్త మెరుపులు మెరిపించడం వల్లే బెంగళూరు స్కోరు వంద దాటింది. లేకుంటే మరోసారి తక్కువ స్కోరుకే కుప్పకూలేది.
డివిలియర్స్‌పైనే ఆశలు..
ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆశలన్నీ స్టార్ ఆటగాడు డివిలియర్స్‌పైనే నిలిచాయి. డివిలియర్స్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో తప్ప డివిలియర్స్ మిగతా మ్యాచుల్లో బాగానే ఆడాడు. ఈసారి కూడా జట్టు అతనిపై ఆశలు పెట్టుకుంది. విధ్వంసక ఆటతో చెలరేగి పోతున్న డివిలియర్స్‌కు మద్దతుగా నిలిచే వారు కనిపించడం లేదు. దీంతో అతను ఒత్తిడికి గురికాక తప్పడం లేదు. కెప్టెన్ కోహ్లి కూడా ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే జట్టుకు మరోసారి ఇబ్బందులు తప్పక పోవచ్చు. అంతేగాక బౌలింగ్ కూడా గాడిలో పడాల్సిందే. హైదరాబాద్ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరోసారి ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు సాధించే ప్రమాదం ఉంది.
ఇరు జట్లకు కీలకం..
మరోవైపు రాజస్థాన్ మెరుగ్గానే ఆడుతున్నా అదృష్టం కలిసి రావడం లేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ వల్ల రాజస్థాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. హైదరాబాద్, చెన్నైలతో జరిగిన మ్యాచుల్లో కూడా రాజస్థాన్ చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈసారి మాత్రం రాజస్థాన్ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. విజయం వాకిట వరకు వచ్చి ఓటమి చవిచూసే సంప్రదాయాన్ని మార్చేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే స్టార్ ఆటగాళ్ల వైఫల్యం రాజస్థాన్‌కు ప్రతికూలంగా మారింది. తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్ తర్వాతి మ్యాచుల్లో విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు సమస్యగా తయారైంది. కెప్టెన్ రహానె బ్యాటింగ్‌లో కూడా నిలకడ లోపించింది. కనీసం ఈసారైనా రహానె తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టార్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, స్టీవ్ స్మిత్‌లు ఆశించిన స్థాయిలో రానించడం లేదు. ఇది కూడా జట్టును వెంటాడుతోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్, బౌలింగ్ లోపాలు సరిదిద్దు కుంటేనే రాజస్థాన్‌కు విజయం దక్కుతోంది. లేకుంటే మరో ఓటమి ఎదురు కావడం ఖాయం.
తొలి గెలుపు కోసం..
RELATED ARTICLES