రాష్ట్రంలో ఒక్కరోజే 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు
మరో 11 మంది మృతి
64,786కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మొదటిసారిగా ఒక్క రోజే పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మార్క్‌ను దాటింది. జిహెచ్‌ఎంసితో పాటు జిల్లాల్లోని కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. కాగా, తెలంగాణలో కొత్తగా 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 64,786కు చేరింది. గడిచిన 24 గంటల్లో 11మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం 530 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.81 ఉండగా జాతీయ స్థాయిలో 2.18 శాతంగా ఉన్నది. 21,011 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 883 మందికి రిపోర్ట్ రావాల్సి ఉన్నది. ఈ మేరకు శుక్రవారంనాటి (సాయంత్రం 8గంటల వరకు) కరోనా వైరస్ బులెటిన్‌ను వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసింది. వారం రోజుల నివేదిక ప్రకారం కరోనా సోకిన వారిలో 65.6 శాతం పురుషులు, 34.4 శాతం మహిళలు ఉన్నారు. కొవిడ్ నుంచి కొలుకుని తాజాగా 1114 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 46,502 మంది కోలుకోగా.. 17,754 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11,359 మంది హోమ్/ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24గంటల్లో జిహెచ్‌ఎంసిలో 578 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, రంగారెడ్డిలో 228, మేడ్చల్- మల్కాజిగిరిలో 197, వరంగల్ అర్బన్‌లో 134, కరీంనగర్‌లో 108, సంగారెడ్డిలో 101 కేసులు నమోదయ్యాయి. టెలిమెడిసిన్, లేదా ఇతర సమస్యలేమైనా ఉంటే 104 నంబర్‌కు, ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 9154170960 నంబర్‌కు ఫోన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
జిల్లాల వారీగా కరోనా లెక్కలు :
శుక్రవారం ఒక్క రోజే ఆదిలాబాద్-లో 17, భద్రాచలం కొత్తగూడెం-లో 35, జిహెచ్‌ఎంసి-లో 578, జగిత్యాలలో-21, జనగాం-లో 21, జయశంకర్ భూపాల్‌పల్లి-లో 24. జోగులాంబ గద్వాల్-లో 35, కామారెడ్డి-లో 18, కరీంనగర్- 108లో, ఖమ్మంలో- 32, కొమురంబీమ్ ఆసిఫాబాద్-లో 8, మహబూబ్‌నగర్-లో 31, మహబూబాబాద్-లో 40, మంచిర్యాలలో-37, మెదక్-లో 16, మేడ్చల్ -మల్కాజిగిరిలో- 197, ములుగులో- 19, నాగర్‌కర్నూల్-లో 18, నల్లగొండలో- 48, నారాయణపేట్-లో 9, నిర్మల్-లో 25, నిజామాబాద్-లో 73,పెద్దపల్లి-లో 42, రాజన్న సిరిసిల్లలో 39, రంగారెడ్డిలో 228, సంగారెడ్డిలో -101, సిద్దిపేటలో -16, సూర్యాపేట-లో 34, వికారాబాద్-లో 21, వనపర్తి-లో 9, వరంగల్ రూరల్-లో 39, వరంగల్ అర్బన్‌లో – 134, యాదాద్రి- భువనగిరిలో -10 కొత్త కేసులు నమోదయ్యాయి.
తొలిసారి 2,083
RELATED ARTICLES