కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పూరీ వెల్లడి..
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా గత రెండునెలలుగా విమాన సర్వీసులు ఆగిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో సోమవారం నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దీనిలోభాగంగా తొలిరోజే 832 విమానాలు నడిచినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. వీటిలో మొత్తం ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈరోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయినట్లు కేంద్రమంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణికులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ పూరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, తొలిరోజు కొన్ని రాష్ట్రాలు విమానాల సంఖ్యను నియంత్రించడంతో చివరి క్షణంలో చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వందల మంది విమాన ప్రయాణికులు గంటలకొద్దీ విమానాశ్రయాల వద్దే పడిగాపులుకాచారు. నిన్న ఒక్కరోజే దిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 80 సర్వీసులు రద్దైనట్లు సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రారంభించగా పూర్తి స్థాయిలో నడిపేందుకు మరిన్ని సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
తొలిరోజు..832 విమానాల్లో ప్రయాణికులు!
RELATED ARTICLES