ఉత్తర్వులు ఇచ్చే వరకు కూల్చొద్దు
సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : తాము తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చరాదని హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. కొత్తగా కట్టబోయే బిల్డింగ్స్ ప్లాన్, ఇతర ప్రణాళికలపై క్యాబినెట్ ఏవిధమైన నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫున అడిషినల్ ఎజి జె.రామచందర్‌రావు చెప్పారు. దీంతో ఇప్పటివరకు బిల్డింగ్స్ కూల్చరాదన్న ఓరల్ ఆర్డర్‌ను ఇప్పుడు లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించి బుధవారం మధ్యంతర ఆదేశాలిచ్చింది. సెక్రటరేయట్ బిల్డింగ్స్ కూల్చి కొత్తగా కట్టేందుకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేవంత్‌రెడ్డి, ప్రొ.విశేశ్వర్‌రావు, ఇతరులు వేసిన పిల్స్‌ను బెంచ్ విచారించింది. పిల్స్‌ను కొట్టేయాలని, ఇవన్నీ రాజకీయంగా వేసినవని ప్రభుత్వం తరఫు అడిషినల్ ఎజి రామచందర్‌రావు వాదించారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం వల్లే పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని బెంచ్ గుర్తుచేసింది. డిజైన్ల వ్యవహారంలోనూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే డిజైన్‌పై నిర్ణయం తీసుకుని, క్యాబినెట్ తుది నిర్ణయం వెలువడే వరకు సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చరాదని, అవన్నీ చేసినా తాము ఆర్డర్ ఇచ్చే వరకూ కూడా కూల్చకూడదని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సెక్రటేరియట్ కట్టేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా మాకు ఇచ్చిన పత్రాల్లోనే ఉందని, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఎలా చెబుతారని బెంచ్ ప్రశ్నించింది. కొత్తగా కట్టేందుకు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందని ఆర్అండ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హైకోర్టులో కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు నివేదించారు. 4.45 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో 32 శాఖలకు కేటాయింపులు ఉన్నాయని, కొత్తగా నిర్మాణం జరిగితే అన్ని శాఖలకు విడివిడిగా స్థల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. తెలిపింది. సచివాలయాన్ని కూల్చి అత్యాధునిక వసతులతో భావితరాలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాహనా ల పార్కింగ్, ఒక శాఖకు చెందిన మంత్రి నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది వర కూ పర్యవేక్షణకు వీలుగా కేటాయింపులు ఉంటాయన్నారు. విశాలమైన సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టులో పలు కేసులు దాఖలైన నేపథ్యంలో ఆర్కిటెకట్స్ల నుం చి డిజైన్లు అందినప్పటికీ డిజైన్లను ఖరారు చేయలేదన్నారు. మంత్రివర్గం సమావేశమై డిజైన్ల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్తగా 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కటతామన్నారు. తుది దశలో ఈ అంశం లేదని, పిల్స్‌ను కొట్టేయాలని కోరారు.
తొందరేల?
RELATED ARTICLES