హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల. ఇప్పుడు మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యే కథాంశాలతో సినిమాలు చేయటంపై తన దృష్టిని సారిస్తున్నారు. అందులో భాగంగా తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’తో ఆడియన్‌ను అలరించబోతున్నారు.‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. సెప్టెంబర్ 13న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీను ంచి ‘పట్నం పిల్ల..’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాల ప్రధానంగా సాగే చిత్రం. లిరికల్ సాంగ్ గమనిస్తే.. హీరోయిన్ పట్నం నుంచి సెలవులకు పల్లెటూరుకి వస్తుంది. అక్కడ హీరో ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు. తన మనసులోని ప్రేమలో తెలియజేసేందు తను పడే పాట్లు, మనసులోని భావాలను వ్యక్తం చేసే పాట ఇదని అర్థమవుతుంది. ఈ చిత్రానికి ప్రవీన్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ‘పట్నం పల్ల..’ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
తేజస్ కంచర్ల హీరోగా ‘ఉరుకు పటేల’ నుంచి ‘పట్నం పిల్ల..’ లిరికల్ సాంగ్
RELATED ARTICLES