ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పెరిగిన పత్తి విస్తీర్ణం
ప్రజాపక్షం / ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి పంటకు డిమాండ్ పెరిగి మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో లభించడంతో రైతులు ఇతర పంటల కంటే పత్తి పంట సాగు వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది పత్తి క్వింటాల్‌కు రూ.8500 నుంచి ప్రారంభమైన మద్దతు ధర చివరకు రూ.11 వేలకు పైగా చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒకపుడు ఖరీఫ్ సీజన్‌లో పత్తి పంటతో పాటు సోయాబీన్, కంది, పెసర, మినుము పంటలకు ప్రాధాన్యమిస్తూ పంటలను సాగు చేసిన రైతులు తరువాత క్రమంలో కొన్ని పంటలను తగ్గిస్తూ వచ్చారు. దీంతో గత ఏడాది వరకు సోయాబీన్, కంది, పెసర, మినుము పంటలకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన రైతులు ఈ ఏడాది పత్తి విస్తీర్ణాన్ని మరింత పెంచి పత్తిని సాగు చేశారు. అయితే సోయాబీన్‌ను సాగు చేసిన ఏదో అంతంత మాత్రంగానే సాగు చేశారని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం 5.27 లక్షల ఎకరాలు కాగా అందులో పత్తి పంట 3.92 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ మాత్రం కేవలం 57 వేల ఎకరాల్లో సాగు జరిగిందంటే ఆ పంటను ఎంత తక్కువగా సాగు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక కంది పంట సోయాబీన్ కంటే మరో 3 వేల ఎకరాల్లో తక్కువ గానే సాగైంది. కంది పంటను కేవలం 54 వేల ఎకరాల్లోనే రైతులు సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన ఒకటి, రెండు వర్షాలకు రైతులు తమ పంట పొలాల్లో పత్తి వితనాలు నాటారు. ఆ తరువాత క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలో అధిక శాతం పత్తి పంటను రైతాంగం సాగు చేద్కేంద్ర భారత పత్తి సంస్థ (సిసిఐ) పత్తి కొనుగోళ్ల కోసం రంగంలోకి దిగినప్పటికీ సిసిఐ మద్దతు ధర రూ.6వేలపై చిలుకు మాత్రమే ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించారు. కాగా గత ఏడాది పత్తి పంటలో కాస్త లాభాలు రావడంతో రైతులు ఈ ఏడాది పత్తి పంటను అధిక మొత్తంలో సాగు చేశారు. ఇక సోయాబీన్ సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. పంట పెట్టుబడులలో పత్తి పంటకు అధిక శాతం ఖర్చులున్నప్పటికీ పత్తికి పంటకు మద్దతు ధర కూడా అధికంగానే ఉండటంతో రైతులు పత్తి పంట వైపు అధిక మొగ్గు చూపి ఆదిలాబాద్ జిల్లాలో పత్తిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు