పలువురు సిఎంలతో ఫోన్లలో సమీక్ష
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రాలపై ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌కు సంబంధించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేసి కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు మోడీ ఫోన్ చేశారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్‌ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు. మరోవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న బిహార్, అసోం, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు మోడీ అభినందనలు తెలిపారు. అయితే ఈ రెండు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో పెరుగుతున్న కేసుల పట్ల మోడీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై ప్రధాని ఆరా
RELATED ARTICLES