అమిత్‌షాతో నరసింహన్ భేటీ
పరిశీలనలో సుష్మాస్వరాజ్, కిరణ్‌బేడీ, సుమిత్ర మహాజన్ పేర్లు
ప్రజాపక్షం/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా న్యూఢిల్లీలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో పాటు తదితర అంశాలను అమిత్‌షాకు గవర్నర్ వివరించినట్లు తెలిసింది. కేవలం మర్యాదపూర్వకంగానే అమిత్‌షాను కలిసినట్లు గవర్నర్ వివరించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని, విభజన చట్టం ప్రకారం ఇప్పటికే తొలి విడతగా హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవనాలను తెలంగాణకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, న్యూఢిల్లీలోని ఆంధప్రదేశ్ భవనం అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు ఆయన వివరించారు.