కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా 6న బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్ లీగల్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారంనాడు నోటిఫికేషన్ విడుదలైంది. కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఏప్రిల్ 6వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. భారత రాజ్యాంగంలోని 222 ఆర్టికల్ క్లాజు (1) కింద భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక భారత రాష్ట్రపతి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్‌ను కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ పేర్కొంది. బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ కూడా ఈ నోటిఫికేషన్‌ను పోస్ట్ చేసింది. జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి గతంలోనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఎట్టకేలకు ఆమోదముద్ర లభించింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ
RELATED ARTICLES