హైదరాబాద్: తెలంగాణ శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు గురువారం తెరపడింది. శాసనసభాపతి అభ్యర్థిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(69)ని సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సిఎం కెసిఆర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్ బలాల, సురేఖా నాయక్, అబ్రహం ఉన్నారు. నెల రోజులుగా కసరత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి పోచారంతో కెసిఆర్ మాట్లాడారు. గురువారం ఉదయమే పోచారం పేరు ప్రకటించి, ఆయనతో నామినేషన్ దాఖలు చేయించారు. అనుభవం ఉన్న నేతగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను సమర్థంగా నిర్వహించగలరని కెసిఆర్ భావిస్తున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన పోచారం శాసనసభకు ఆరోసారి ఎంపికయ్యారు.
తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం
RELATED ARTICLES