ప్రజాపక్షం/బంట్వారం: తెలంగాణ, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో మూడు తరాలుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులు సాగు చేస్తుకుంటున్న భూమిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కర్నాటక ప్రభుత్వం లాక్కుంటుందని బాధిత రైతులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల పరిధిలో ఉన్న తొర్మామిడి గ్రామానికి చెందిన 40 మంది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే 1954 సంవత్సరం కంటే ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక, మద్రాసు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తొర్మామిడి గ్రామనికి చెందిన 40కిపైగా రైతు కుటుంబాలు బంట్వారం మండల పరిధి గుల్బర్గా జిల్లా చించోళి తాలుకా పరిధిలో ఉన్న కుంచారం మండలం మొదుగుపురం రెవెన్యూ గ్రామానికి చెందిన భూమి సర్వేనంబర్ 140 విస్తీర్ణం 347 ఎకరాలు ఉండగా, అందులో 50 ఎకరాలను తొర్మామిడి గ్రామ రైతులు గత మూడు తారాలను ప్రభుత్వాలు విధించే భూమికి శిస్తును కడుతూ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పడు ఉమ్మడి రాష్ట్రాలుగా కలసి ఉన్నప్పడు రైతులు భూమిని సాగుచేసుకొని ప్రభుత్వాలకు భూమి శిస్తు కట్టేవారమని, ఇప్పడు సాగు చేసుకుంటున్న భూమి కర్ణటక రాష్ట్రమైన రిజర్వు ఫారెస్టు కింద ఉందని, రైతులు 2 వందల సంవత్సారాల క్రితం నుండి సాగు చేస్తుకుంటున్నారని తెలిసి కూడా కర్ణాటక ప్రభుత్వం భూమిని లాక్కుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్టు రిజర్వు అధికారులు బందోబస్తుతో కర్ణాటక రిజర్వు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, సంజీవ్‌కూమార్ చౌహన్, మహ్మద్ మునిర్ ఆహ్మద్ చించోళి, చిత్తాపూర్, గుల్బార్బా జాయింట్ ఆపరేషనుతో సోమవారం మొద్గుపురం గ్రామం శివారులో ఉన్న సర్వేనంబర్ 140 విసీర్ణం 347 ఎకారల్లో 50 ఎకరముల భూమి రిజర్వు ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌కు చెందినదని స్వాధీనం చేసుకున్నారు
తెలంగాణ రైతుపై కం(న్న)డ కావరం
RELATED ARTICLES