ఉప లోకాయుక్తగా వి.నిరంజన్‌రావు,
హెచ్‌ఆర్‌సి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య
ప్రజాపక్షం / హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ చింతపంటి వెంకట రాములు, ఉప లోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్‌రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని కమిటీ లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను సిఫార్సు చేసింది. ప్రగతిభవన్‌లో గురువారం ఉదయం సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో సభ్యులు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ, శాసనమండలిలో విపక్ష నాయకులు జాఫ్రీ పాల్గోన్నారు. ప్రతిపక్ష నేత, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశానికి ఎంఐఎం ఉప నేత పాషాఖాద్రీ హాజరైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. కమిటీ లోకాయుక్తగా జస్టిస్ సి.వి.రాములు, ఉప లోకాయుక్తగా జి.నిరంజన్‌రావును సిఫారసు చేసింది. కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింధ. ఇదిలా ఉండగా లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ చింతపంటి వెంకట రాములు హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించగా, ఉప లోకాయుక్తగా నియమితులైన ఒలిమినేని నిరంజన్‌రావు డిస్ట్రిక్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు.
హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ బి.చంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్‌లను నియమిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.