HomeNewsBreaking Newsతెలంగాణ ఉద్యోగుల వేత‌నాల్లో కోత‌

తెలంగాణ ఉద్యోగుల వేత‌నాల్లో కోత‌

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ సృష్టించిన సంక్షోభం నేప‌థ్యంలో ఆర్థిక ప‌రిస్థ‌తులు అనుకూలించక‌పోవ‌డంతో రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల్లో కోత విధించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నారు.
– ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.
– ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తారు.
– మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.
– నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు.
– అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధిస్తారు.
– నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధిస్తారు.
– అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments