HomeNewsBreaking Newsతెలంగాణ అప్పు… రూ.3,12,191 కోట్లు

తెలంగాణ అప్పు… రూ.3,12,191 కోట్లు

ఐదేళ్లలో 94.75 శాతం పెరుగుదల
వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ :
తెలంగాణ రోజురోజుకు అప్పుల పాలవుతోంది. రాష్ట్రంలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని స్వయం గా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పు లు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ. 1,60,96.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ. 3,12,191.3 కోట్లకు చేరినట్లు పేర్కొం ది. లోక్‌సభలో బిఆర్‌ఎస్‌ ఎంపిలు వెంకటేశ్‌, రంజిత్‌రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2017- గతేడాదితో పోలి స్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021- 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్థికశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏటేటా పెరుగుతున్న అప్పు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఎపి అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. అదే 2017- గతంతో పోలిస్తే 9.8శాతం అప్పులు తగ్గాయని కేంద్రం పేర్కొంది. 2020 నాటికి అప్పులు 17.1శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. ఎపి జిడిపిలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2014లో రాష్ట్ర జిడిపిలో అప్పుల శాతం 42.3శాతంగా ఉన్నట్టు పేర్కొన్న కేంద్ర ఆర్థికశాఖ.. 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది. 2015లో రాష్ట్ర జిడిపిలో 23.3శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5శాతానికి పెరిగినట్టు వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments