అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తర్జనభర్జనలు చేస్తోంది. నేరుగా పోటీ చేయాలా లేక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి తమ ప్రభావాన్ని చూపాలా అన్న అంశంపై పవన్ కళ్యాణ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై పవన్ కళ్యాణ్ అమరావతిలో మాట్లాడుతూ, తెలంగాణలో 23 స్థానాల్లో పోటీచేయాలని భావించామని, అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో సన్నద్థం కాలేకపోతున్నామని తెలిపారు. అయితే స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి వారికి మద్దతునిచ్చే ఆలోచన కూడా వుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతామని వెల్లడించారు.
తెలంగాణలో పోటీపై జనసేన మల్లగుల్లాలు
RELATED ARTICLES