HomeNewsBreaking Newsతెలంగాణపై ప్రధాని మోడీ కుట్రలు మానుకోవాలి

తెలంగాణపై ప్రధాని మోడీ కుట్రలు మానుకోవాలి

రాష్ట్రంలో అధికారం కోసం వ్యవస్థల దుర్వినియోగంతో అడ్డదారులా?
ఆర్థిక, రాజకీయ అనైతిక చర్యలతో ముప్పేట దాడులు సరికాదు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా, ప్రగతిని ముందుకు సాగనీయకుండా ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించా రు. రాష్ట్రంలోని పరిపాలనను అస్థిరపరచడం తో పాటు, ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా స్వతంత్ర, రాజ్యాంగ సంస్థలైన ఐటి, ఎన్నికల కమిషన్‌, గవర్నర్‌ వ్యవస్థలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.155 లక్షల కోట్లకు చేరిందని, ఎనిమిదేళ్ళలో రూ.100 లక్షల కోట్ల అప్పులు అదనంగా చేసిన ఘనులు ఎఫ్‌ఆర్‌బిఎం పేరుతో తెలంగాణపై ఆంక్షలు పెడుతూ ఆర్థిక దిగ్భందనం చేస్తున్నారని విమర్శించారు. తమ చేతుల్లోని వ్యవస్థలతో రాష్ట్రంపై ఆర్థిక, రాజకీయ, అనైతిక పద్ధతు ల్లో కేంద్ర ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందన్నారు. తద్వా రా తెలంగాణలో అస్థిర పరిస్థితులు ఉన్నాయని బయటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని మండిపడ్డా రు. అసలు ఉమ్మడి ఎపి విభజన హామీలే అమలు చేయని బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ పగటి కల లు కంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు ఇచ్చి, అభివృద్ధి చేసి ప్రజల మనసులు చూరగొనాలే తప్ప కుయుక్తులతో అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒకవైపు రాష్ట్రం స్వంత వనరులతో ముందుకు సాగుతోంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణకు వివిధ రూపాలలో రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల నిధులకు మోకాలడ్డుతూ ఆర్థిక దాడికి పాల్పొడుతోందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌, పదహారవ ప్రణాళిక సంఘం చేసిన సిఫార్సులను తుంగలో తొకి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేస్తామనుకున్న అంచనాలను ఓటర్లు పటాపంచలు చేయడాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో తన చేతిలోని ఇడి, ఐటిలను దుర్వినియోగం చేయడం, గవర్నర్‌ వ్యవస్థల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తుందని, రాజకీయ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. మరో వైపు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు మఠాధిపతులతో ఎంఎల్‌ఎలను కొనుగోలుచేసే అనైతిక పద్ధతులకు పాల్పడుతోందన్నారు. పాద యాత్రల పేరుతో బండి సంజయ్‌ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలంగాణను తప్పుడు కోణంలో చూపే ప్రయత్నాలేనని కూనంనేని అన్నారు. తక్షణమే తెలంగాణకు రావాల్సిన జిఎస్‌టి బకాయిల నుండి ఇతర నిధుల వరకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోతే, తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరిత వైఖరిని కొనసాగిస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే సమస్యే లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ కూడా కేంద్ర దుర్నీతికి వ్యతిరేకంగా, కుట్రలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలకు సంసిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కూనంనేని సాంబశివరావు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments