సెప్టెంబర్ 17న ఎవరైనా జాతీయజెండా ఎగురవేయొచ్చు : దీనిపై వివాదమెందుకు?
నిజాంను రాజ్‌ప్రముఖ్ చేసింది పటేల్ కాదా : సిఎం
ప్రజాపక్షం / హైదరాబాద్ : “తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని నేను కూడా డిమాండ్ చేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత సమకాలీన పరిస్థితులను బట్టి, పాత గాయాలను రేపొద్దని మేధావుల సూచన చేశారు. అందుకు దాన్ని పక్కన పెట్టిన” అని సిఎం కె.చంద్రశేఖర్‌రావు శాసన సభ లో చెప్పారు. నిజాం పాలన, తర్వాత మిలటరీ పాలన నుండి బయటపడిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం ద్వారా పెనం మీద నుంచి పోయ్యిలో పడినట్లయిందన్నారు. వీటన్నింటి తరువాత 2014 జూన్ 2న తెలంగాణకు నిజమైన విముక్తి లభించిందన్నారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సెప్టెంబర్ 17పై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. అసలు దానిపై వివాదం ఎం దుకని ప్రశ్నించారు. ఆ రోజున ఎవరికి తోచింది వారు చేసుకోవచ్చని, ఎవరినీ అడ్డుకోమని ఊరేగింపు తీస్తామన్నా అనుమతిస్తామని ముఖ్యమంతి చెప్పారు.