న్యూఢిల్లీ: ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ చందా కొచ్చర్ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లం ఘించారని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి బిఎన్ కృష్ణ సారథ్యంలో ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నిర్ధారించింది. స్వతంత్ర దర్యాప్తులో ఆమె చేసిన తప్పు వెల్లడైందని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది. ఆసక్తుల సంఘర్షణ, విశ్వసనీయ కర్తవ్యాలకు సంబంధించిన నియమావళిని ఆమె ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయిందని పేర్కొంది. దర్యాప్తు నివేదికను తన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రచురించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోద ని కూడా ఐసిఐసిఐ బ్యాంకు పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్ శ్రీకృష్ణ నిర్వహించిన దర్యాప్తులో వీడియోకాన్ లిమిటెడ్‌కు ఐసిఐసిఐ బ్యాంకు చేసిన రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. చందా కొచ్చర్ ఐసిఐసిఐ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. దీంతో ఆమె రాజీనామాను టెర్మినేషన్గా బ్యాంకు పరిగణించింది.
తుంగలో తొక్కారు!
RELATED ARTICLES