కాళేశ్వరంపై సివిసి దర్యాప్తు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఒక పక్క తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలను ఆదు కోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.21వేల కోట్లతో టెండర్లు పిలవడం సరైనదేనా అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ దర్యాప్తు కోరతామన్నారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.21వేల కోట్ల టెండర్లు పిలవడాన్ని రిటైర్డ్ ఇంజినీర్స్ అసోషియేషన్ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్గత పనుల వల్ల అదనంగా రూ.8వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని చెప్పారు. తెలం గాణ రాష్ట్రానికి ఇప్పటికే రూ.3.21లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, తాజా టెండర్‌లతో మరో రూ.21వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. ఎలాంటి అప్పులు లేకుండా నాగార్జునసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల ఆధారం గానే ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కట్టారన్నారు. రాష్ర్టంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని సమయంలో కాళేశ్వరంలో ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, కాళేశ్వరం టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్ కమి షనర్‌కు లేఖ రాస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రుణాలు ఇస్తున్న సం స్థలు ప్రాజెక్టుల డిపిఆర్‌పై విచారణ చేయాలని కోరారు. ప్రతిపక్షాలను, -మీ డియాను తిడితే అసలు విషయాలు బయటకు రావని సిఎం ఆలోచన అని ఆ రోపించారు. మద్యం షాపులు తెరవడంతో లాక్‌డౌన్‌లో ఇన్ని రోజులు వైద్యులు, పోలీసులు పడిన శ్రమంతా వృథా అయినట్లే కదా? అని అన్నారు. పోలీసులను కాపలా పెట్టి ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టిందని, ప్రజల ను తాగండి.. తాగండి అని ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపడుతోందని విమర్శించారు. తాగుబోతులు, చీప్ లిక్కర్ తాగే వాళ్ళు భౌతిక దూరం పాటించాలి అంటే పాటిస్తారా?, కరోనా వ్యాప్తి వల్ల తాగుబోతులు సచ్చినా ప ర్వాలేదు అని ప్రభుత్వం భావిస్తుందా? అని ప్రశ్నించారు.
తిండిలేక జనం అల్లాడుతుంటే.. రూ. 21వేల కోట్లతో టెండర్లా?
RELATED ARTICLES