ప్రజాపక్షం/హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గంలో తాజా మాజీ మంత్రులకు మరోసారి అమాత్యయోగం వరిస్తుందా అనేది పార్టీలో చర్చనీయంశంగా మారింది. పాత, కొత్త కలయికలతో మంత్రివర్గ ఏర్పాటు ఉం టుందని ఇది వరకే సిఎం కెసిఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుత మినీ మంత్రివర్గంలో ఎందరికి అవకాశం లభిస్తుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. ముందుగా 8 నుంచి 10 మందితోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందనే ప్రచారం నేపథ్యం లో ఇందులో తాజా మాజీ మంత్రులతో పాటు కొత్తవారికీ అవకాశం లభించనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు తాజా మాజీ మంత్రులు ఓడిపోయారు. మరో తాజా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్‌గా ఎన్నికవ్వగా హోంమంత్రిగా మహ్మద్ మహమూద్ అలీకి అవకాశం దక్కిం ది. అయితే మాజీ మంత్రి కెటి.రామారావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడే మంత్రివర్గంలో ఉంటారా? లేదా లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయనకు కీలక పదవిలో ఉండవచ్చని, లేదా మంత్రివర్గంలో ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టి.హరీశ్‌రావును మినీ మంత్రి వర్గంలో ఉంటారా..? లేదా అనేది పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా మిగిలిన తాజా మాజీలు తమకు అవకాశాలపై ఎవరికి వారే అంచనా వేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి మహిళా కోటాలో ఈసారి మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు మంత్రివర్గంలో అవకాశం లభించింది. దీంతో ఈ సారి ఇందులో ఒకరికే అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే మినీ మంత్రివర్గంలో పాతవారిని కాదని కొత్తగా అవకాశం కల్పించాల్సి వస్తే ఎస్‌టి మహిళ కోటాలో రేఖనాయక్ లేదా ఎస్‌సి సామాజిక వర్గం, అలాగే విద్యార్థి, యువజన విభాగం కోటాలో బాల్క సుమన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌గా ఎన్నిక కావడంతో అదే సామాజిక వార్గనికి చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌కు రాష్ట్రంలోనే బిసిలలో అగ్రనాయకునిగా ముద్రపడిన నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా చీఫ్ విప్‌గా పనిచేసిన ఇదే జిల్లా కు చెందిన కొప్పుల ఈశ్వర్‌కు పేరు కూడా వినిపిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఉండగా కొత్తగా నల్లగొండ ఎంపి, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జిల్లాకు చెందిన మండలి విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఈ జిల్లా నుంచి మల్కాజిగిరి ఎంఎల్‌ఎ మల్లారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ మినీ మంత్రివర్గంలో అవకాశం ఉండవకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఆజ్మీరా చందూలాల్ ఓడిపోయారు. పెద్దల సభ కోటాలో కడియం శ్రీహరి మాజీ డిప్యూటీ సిఎంగా ఉన్నారు. కానీ కొత్తగా ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు పరిశీలనలో ఉన్నది. గత మంత్రివర్గంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లికి లైన్ క్లీయర్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి తాజా మాజీ డాక్టర్ లక్ష్మారెడ్డికి బదులుగా వనపర్తి ఎంఎల్‌ఎ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు.
తాజా మాజీలకు మళ్లీ ఛాన్స్?
RELATED ARTICLES