ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సిఎం కెసిఆర్
పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం
పలు కీలకాంశాలపై చర్చ
ప్రజాపక్షం/హైదరాబాద్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అనంతరం సిఎం ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో కెసిఆర్ పలు కీలకమైన అంశాలపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపైన సిఎం కెసిఆర్ ఆరా తీశారు.కాగా ఈనెల 11న సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లిన కెసిఆర్, అక్కడి నుండి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ బిఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. కొందరు ముఖ్యనేతలతో జాతీయ రాజకీయాలపైన కెసిఆర్ చర్చించారు. ఆ తర్వాత సిఎంకు స్వల్ప అస్వస్తతకు గురవ్వగా అక్కడే చికిత్స తీసుకున్నారు.అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
తాజా పరిస్థితేంటి?
RELATED ARTICLES