HomeNewsBreaking Newsతాగునీటి సమస్యకు చెక్‌

తాగునీటి సమస్యకు చెక్‌

నాలుగు జిల్లాలో రూ. 1212 కోట్లతో 1900 గ్రామాలకు తాగునీరు సరఫరా
వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రులు హరీశ్‌, ఎర్రబెల్లి
ప్రజాపక్షం/ సిద్దిపేట ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ నుండి నాలుగు జిల్లాలకు నీరందించే ట్రయల్‌ రన్‌ నిర్వహణలో సిద్దిపేట జిల్లా కొండపాక మం డలం మంగోల్‌లో నిర్మించిన వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ను మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సిఎంఒ ఒఎస్‌డి స్మీతా సబర్వాల్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ 50 ఎకరాల విస్తిర్ణంలో 1212 కోట్ల రూపాయలతో రోజు 540 మిలియన్‌ లీటర్ల శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో అతిపెద్దగా నిర్మించిన నీటి శుద్ధికరణ ప్రాంట్‌ అన్నా రు. దీంతో 1900 ఆవాసాలకు, 9 నియోజకవర్గాలకు, 16 మున్సిపాల్టీలకు తాగునీరు అం దనుందన్నారు. మిషన్‌ భగీరథ దేశంలో తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తుందన్నా రు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్‌లో కితాబునిచ్చిందన్నారు. అవార్డులు మీదు అవార్డులు ఇచ్చారని, తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు చెప్పారన్నారు. కాని తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించలేదన్నారు. మన పథకాలను కేంద్రం కాఫీ కొడుతుందన్నారు. వర్షపు నీళ్లను ఫిల్టర్‌ చేసి ఇంటింటికి నీళ్లు ఇస్తే, ఇతర రాష్ట్రాల్లో బోర్ల నీరు ఇస్తున్నారన్నారు. మిషన్‌ భగీరథకు నిధులు ఇస్తామని కేంద్రం ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.
భవిష్యత్‌ 50 ఏళ్లకు అనుగుణంగా ఈ పథకం-: మంత్రి హరీష్‌రావు
మిషన్‌ భగీరథ చరిత్రలో సుస్థిరమైన రోజు… దేశంలో ప్రతిరోజు 540 ఎంఎల్‌డి సామర్థ్ంయతో నీటి విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. అధునాతన టెక్నాలజీ, ఈక్విప్‌మెంట్‌ను వినియోగించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో మానవులు నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ అని, ఏడు జిల్లాలు, 10 నియోజక వర్గాల్లో 1922 గ్రామాలకు నీటి సరఫరా అవుతుందన్నారు. హైదరాబాద్‌ నగరానికి సైతం ఏంతో మేలు జరుగుతుందన్నారు. ఏడు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గ్రావీటి ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. జూన్‌ నెలలో పూర్తి కావాల్సి ఉండగా ఈ పథకాన్ని రెండు నెలల ముందుగానే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. మిషన్‌ భగీరథకు 13 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ చెప్పినా 13 పైసలు ఇవ్వలేదన్నారు. గుజరాత్‌, గోవా రాష్ట్రాలకు ఇస్తారు కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వట్లలేదన్నారు. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ పథకాన్ని గజ్వేల్‌లో ప్రారంభించి అభినందించింది ప్రధాని మోడీ కాదా అన్నారు. మిషన్‌ భగిరథతో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ గిరిజనప్రాంతాల్లో వాటర్‌ డిసీజ్‌లు మాయమయ్యాయన్నారు. దశాబ్దాలు పట్టే ప్రాజెక్టును మూడేండ్లలో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments