ప్రజాపక్షం/హుస్నాబాద్ ఒకే సారి దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరపడం అనేది తలకిందులు తపస్సు చేసిన వీలుగానీ అంశమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనభేరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్ రెడ్డి మాట్లాడారు. జమిలి ఎన్నికల విధానం అనేది దేశంలో పాత విధానమే నని దీనిపై ప్రధాన మంత్రి మోదీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామనడం సరికాదన్నారు.ఒకే దేశం,ఒకే పన్ను,ఒకే ఎన్నిక అన్న మోడీ పెట్రోల్ ఉత్పత్తులను పక్కదారి పట్టిస్తూ జీఎస్టీని అమలు చేయడం లేదన్నారు.దేశంలో 28 పార్టీలు బీజేపికి హటావో దేశ్‌కి బచావో అనే నినాదంతో ముందుకు పోతున్నాయని తెలిపారు.గతంలో పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఏది చేప్పామో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పమన్నారు.పొత్తులో భాగంగా మేము అడిగిన 5 సీట్లు ఇవ్వక పోతే రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్న 33 నియోజకవర్గాల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు.వీరితో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్,పార్టీ శ్రేణులు ఎడల వనేష్,ఎగ్గోజు సుదర్శన చారీ,సంజీవరెడ్డి,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లకిందులు తపస్సు చేసినా వీలుకాదు
RELATED ARTICLES