ప్రజాపక్షం/కామారెడ్డి తరుగు పేరిట మిల్లర్లు రైతులను దోచుకున్నారని రైతులు నిజామాబాద్ కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని, కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేశారు. సొసైటీ ద్వారా సేకరించిన ధాన్యాయన్ని మిల్ల ర్లు మిల్లింగ్ చేయడానికి, ధాన్యం దించడానికి క్వింటాల్‌కు 7 కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. పూర్తి తేమశాతంతో ఎండబెట్టి తర్ర లేకుండా తీసుకువచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకున్నారని వారు ఆరోపించారు. ధాన్యనాన్ని మిల్లర్లు తీసుకోకపోవడంతో ఆ ధాన్యం లారీల్లోనే మగ్గుతుందని వా పోయారు. లారీలు క కల్లాల్లోనే ధాన్యం నిలిచిపోతుందన్నారు. ఆకాల వర్షంతో ధాన్యం తడిసే ప్రమాదం ఉందని, మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతులతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మిల్లర్ల తరుగు తీయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మచ్చర్ల సొసైటీ చైర్మన్ భోజారెడ్డితో మాట్లాడి ఆయన వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్‌ను గ్రామానికి పంపించి తరుగు లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.
తరుగు పేరిట మిల్లర్లు దోచుకున్నారని ఆగ్రహం
RELATED ARTICLES