చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు పొడిచాయి. అధికార అన్నాడిఎంకె, బిజెపి, పిఎం కె మధ్య పొత్తు ఖరారైంది. కేంద్ర మంత్రి పీయూ ష్ గోయెల్ చొరవతో అన్నాడిఎంకె, కాషాయ పార్టీ పొత్తు ఎట్టకేలకు కార్యరూపంలోకి వచ్చింది. రెండు పార్టీల నేతలు అధికారికంగా మంగళవారంనాడు పొత్తు ప్రకటన చేశారు. అన్నాడిఎంకె, బిజెపి కలిసి పనిచేస్తాయని, ఎన్‌డిఎలో అన్నాడిఎంకె చేరిక ఖరారైందని పీయూష్ గోయల్ తెలిపారు. పుదుచ్చేరి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఇటు రాష్ట్రంలో పన్నీర్, పళని సె ల్వం నాయకత్వంలోనూ, అటు కేంద్రంలో మోడీ నాయకత్వంలోనూ పనిచేసేందుకు తాము అంగీకారానికి వచ్చామని, తమిళనాడు ఉప ఎన్నికల్లో నూ అన్నాడిఎంకెకు మద్దతుగా నిలుస్తామని చె ప్పారు. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ ని యోజకవర్గాలకు గాను బిజెపి 5 స్థానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇదిలా ఉండగా ముందుగా మంగళవారం ఉదయం అధికార అన్నాడిఎంకె, పట్టాలి మక్కల్ కచ్చి (పిఎంకె) మధ్య పొత్తు కుదిరింది. పిఎంకె 7 స్థానా ల్లో పోటీ చేస్తుందని మీడియా సమావేశంలో ము ఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీ ర్ సెల్వం చెప్పారు. పిఎంకె ఒక రాజ్యసభ సీటు ను కేటాయించాలని నిర్ణయించామన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో ఎఐఎడిఎంకె, పిఎంకె నా యకులు అధికారికంగా ఎన్నికల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో 21 స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో అధికార ఎఐఎడిఎంకెకు పిఎంకు మద్దతు తెలపనుందని పన్నీరు సెల్వం పేర్కొన్నారు.
తమిళనాట ఎఐఎడిఎంకె, బిజెపి, పిఎంకె మధ్య పొడిచిన పొత్తు
RELATED ARTICLES