HomeNewsBreaking Newsతప్పెవరిది..?

తప్పెవరిది..?

బాధ్యత నుంచి తప్పుకునే యత్నంలో పాలక పార్టీలు
రైతును బలిచేసే రాజకీయ డ్రామాలు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పు డు ధాన్యం కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశమైంది. పండిన ధాన్యానిదో, పండించిన రైతుదో, అధికారంలో ఉండి కొనలేని పాలకులదో, తప్పెవరిదో? ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేనాథుడు లేక కొందరు రైతులు ధాన్యపు రాశులపైనే ప్రాణాలు కోల్పోతుంటే మరి కొందరు ధాన్యపు రాశుల ముందు కూర్చుని కొనేవారు ఎవరు అంటూ దైన్యంగా ఆకాశం వైపు చూస్తున్నా రు. బాధ్యత కలిగి పాలన సాగిస్తున్న పార్టీలు రైతులను పట్టించుకోకుండా రైతు గురించి డ్రామాలు అడితే ఎంత లాభం వస్తుందన్న లెక్కలు వేస్తున్నారు. పోటీలు పడి ఒకరు ఆందోళనలు అంటే.. మరొకరు ఒక రోజు ముందే మేము బంద్‌ చేస్తున్నామంటున్నారు తప్ప రైతుకు వచ్చిన కష్టం నుంచి బయటపడేసే ఆలోచన చేయడం లేదు. బంద్‌లు, ఆందోళన పేరు చెప్పి కొన ఊపిరితో ఉన్న రైతును బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నా రు. కేంద్రమో, రాష్ట్రమో లేక ఇద్దరు కలిసో మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అంటున్న రైతు గోడును పట్టించుకోకుండా బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని టిఆర్‌ఎస్‌ శుక్రవారం ఆందోళనకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గురువారం బిజెపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వామైన లక్షలాది టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేయగలదా.. గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసిం దా? ఈ విషయం ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి నేతలకు తెలియదా అంటే బిజెపి తాను చేయాల్సిన పని చేయకుండా రైతులను మోసం చేసే ప్రయత్నానికి వడిగట్టింది. ఇప్పటికే వ్యవసాయ సంస్కరణ చట్టాల పేరుతో నడ్డి విరిచిన బిజెపి ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును నిరాకరించడం ద్వారా వ్యవసాయ రంగం నుంచి పేద, మధ్యతరగతి సహా రైతాంగాన్ని తరిమేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రకు పాల్పడుతుంది. ఈ కుట్రల్లో భాగమే ధాన్యం కొనుగోలుకు నిరాకరణ. ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో రాజకీయ డ్రామాలకు తెర లేపింది. వ్యవసాయ రంగం ఏడేళ్ల మోడీ పాలనలో కుదేలైంది. రోజు రోజుకు సంక్షోభంలోకి కూరుకుపోతుంది. కరోనాలో పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తులను కొనే వారు లేక నష్టపోయారని లక్షలాది కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించిన ప్రభుత్వం… రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటే ఆ పాలకుల ప్రేమ ఏ వైపు ఉందో అవగతమవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నష్టపోయి రైతులు వ్యవసాయమంటే విసుగు వచ్చేలా చేస్తే కార్పొరేట్‌కు కట్టబెట్టడం సులువవుతుందన్న భావనలో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతి కొద్ది మంది పారిశ్రామిక వేత్తలు నష్టపోయారని లక్షల కోట్ల రూపాయలను ఉదారంగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం శోచనీయం. బిజెపి, టిఆర్‌ఎస్‌ మధ్య గడచిన వారం రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కేంద్ర విధానాలను చింతాకంత కూడా తప్పుపట్టని టిఆర్‌ఎస్‌.. ఒక్కసారిగా తెలంగాణ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. దీనికి ప్రతీగా బిజెపి నేతలు లెక్కలు, డొక్కలు, ఉత్తరాలతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సమన్వయంతో రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా రైతుకు మేమంటే మేము అండగా ఉన్నామని చెప్పి రైతును మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ బంద్‌లు, ఆందోళనల నుంచి మేలు జరుగుతుందని రెండు పార్టీలు భావించడం లేదు. రైతు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడమో లేదా వ్యవసాయ ఉత్తత్తుల కొనుగోళ్ల విషయంలో నష్టపోకుండా చూసుకోవడానికో ప్రయత్నిస్తున్నాయి తప్ప మరోకటి కాదు బిజెపి బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదం. ఇప్పటికైనా కేంద్ర పెద్దలతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకునేలా బిజెపి ప్రయత్నించాలి. రాజకీయ డ్రామాలు ఆపి ఆందోళనలలో పోటీ పడడం కాకుండా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పోటీలు పడితే రెండు పార్టీలకు మంచిది. విపక్షాలు ప్రజలను సమీకరించి ఆందోళనల ద్వారా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకు రావడం సహాజమే. కానీ పాలకులే ఆందోళన చేయడమంటే మూమ్మటికి రాజకీయ లబ్దికోసమే అన్నది స్పష్టం. పంట పండక పండితే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు తిరిగి రాక అప్పులతో సతమతమవుతున్న రైతాంగంతో చెలగాటమాపి ధాన్యపు రాశుల మాటున ప్రాణాలు పొగొట్టుకుంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments