ఇంటర్ ఫలితాల్లో గందరగోళం
జవాబుపత్రాల వాల్యూయేషన్‌పై సందేహాలు
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాలు
బోర్డు కార్యాలయం ముట్టడి
ప్రజాపక్షం/హైదరాబాద్: రెండు రోజుల క్రితం వెలువడిన ఇంటర్ పలితాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. జవాబుపత్రాల వాలుయేషన్‌లో తప్పులు దొర్లాయని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెల్లుబికింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 నుండి 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి సబ్జెక్టుల్లో సింగిల్ డిజిట్ మార్కులు సాధించడం, కొందరు అభ్యర్థులుక రెండు మూడు మార్కులు రావడం మరికొందరికి సున్నా మార్కులు రావడం, పరీక్షకు హాజరు కాని విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగిందని విమర్వలు వెల్లువెత్తాయి. జవాబుపత్రాల వ్యాల్యుయేషన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాగా చదివి ర్యాంకులు సాధించే విద్యార్థులు సింగిల్ డిజిట్ మార్కులతో ఫెయిల్ కవాడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బాగా చదివినా ఫెయిల్ అయినట్లు ఫలితాలు రావడంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలోనే వందల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు శనివారం నాడు నాంపల్లిలోని ఇంటర్ బోర్డును ముట్టడించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఘెరావ్ చేశారు. అధికారుల తప్పిదాలు, వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఫలితాల్లో తప్పులు దొర్లాయని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే అధికారుల తమ తప్పిదాలను వెనక్కువేసుకోవడం తప్ప విద్యార్థులకు న్యాయం చేసే విషయమై మాట్లాడడం లేదని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బి. విశ్వవయ్య అనే విద్యార్థికి ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 నుండి 90 శాతం మార్కులు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలోనూ 80 శాతానికి పైగా మార్కులు వచ్చినా మ్యాథమెటిక్సలో కేవలం 6 మార్కులే వచ్చాయి.