HomeNewsBreaking Newsతప్పుంటే ఎవరినైనా అరెస్టు చేయాల్సిందే

తప్పుంటే ఎవరినైనా అరెస్టు చేయాల్సిందే

సిసోడియాకు ఒక న్యాయం… అదానీకి ఒక న్యాయమా?
సిసోడియాను అరెస్టు చేశారు.. అదానీని ఎప్పుడు అరెస్టు చేస్తారు?
సిబిఐ, ఇడి, ఐటి, ఎన్‌ఐఎలు ప్రతిపక్షాలను, అరెస్టు చేయడం వరకేనా?
బిజెపి నేతలు తప్పులకు అతీతులా?
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీ ష్‌ సిసోడియాను అరెస్టు చేయడం గాని, నిజాలు ఏమిటనే విషయంపైన కాని కాలక్రమంలో అన్ని బైట పడతాయని, అందువల్ల మేము అరెస్టును ఖండించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అదే సమయంలో ఆర్థిక కుంభకోణాలలో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసిని, అలాగే ఇతర సంస్థల ఆదాయాన్ని తన డొల్ల కంపెనీలకు మళ్ళించుకుని, వాటి నష్టానికి కారుకుడై, దాదాపు రూ.13లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడిన అదానీని అరెస్టు చేయా రా? అని ఆయన ప్రశ్నించారు. ఈ మే రకు సోమవారం నాడు కూనంనేని ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్టు చేయడానికి సిపిఐ వ్యతిరేకం కాదు అని, రెండు ఛార్జ్‌ షీట్‌లలో పేరు లేకపోయినప్పటికీ, కేవలం సిబిఐ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పులేద నే సాకుతో సిసోడియాను అరెస్టు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి స్పష్టమవుతోందన్నా రు. ఇప్పటికే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌కు స్పష్టమైన ఆధిక్యత లభించినప్పటికీ, మేయర్‌ పదవిని ఆ పార్టీ కైవ సం చేసుకునేందుకు బిజెపి ముప్పు తిప్పలు పెట్టిందని గుర్తు చేశారు. అదే కోవలో సిసోడియాను అరెస్టు చేయించారని విమర్శించారు. స్వచ్ఛందంగా ఓటర్లకు డబ్బులు పంచకుండా, నిజాయితీగా అత్యధిక మెజారిటీతో 90 శాతం పైగా సీట్లతో అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా బతకనివ్వరా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలకు ఒక న్యాయం.. వారికొక న్యాయమా?
దేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను మాత్రమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ ఆధీనంలో ఉండే సంస్థలతో అరెస్టులు చేయిస్తోందని కూనంనేని మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష పార్టీల వారే తప్పు చేస్తున్నారా? వరవరరావు, సాయిబాబా వంటి రచయితలే తప్పు చేస్తున్నారా? పౌర హక్కుల కోసం కొట్లాడే వారు మాత్రమే తప్పు చేస్తున్నారా? బిజెపిలో ఒక్కరు కూడా తప్పులు చేయడం లేదా? వారేమైనా అతీతులా? అని ఆయన నిలదీశారు. బిజెపి అక్కున చేర్చుకున్న కార్పొరేట్‌ బాబులను, ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీ నేతలను ఎన్ని తప్పులు చేసినా బారా ఖూన్‌ మాఫ్‌ మాదిరిగా వదిలేస్తున్నారని అన్నారు. నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్య, లలిత్‌ మోడీ వంటి వారు బ్యాంకుల నుండి కోట్లాది రుణాలను తీసుకొని, ఎగ్గొట్టినా బిజెపి అండదండలతో విదేశాలలో దర్జాగా తిరుగుతున్నారని అన్నారు. బుల్డోజర్‌ న్యాయానికి తెరలేపి తక్షణ న్యాయం చేస్తున్నామని చెబుతున్న బిజెపి .. నీరవ్‌ మోడీ లాంటి వారి ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలి. బిజెపి ఆశ్రిత పెట్టుబడిదారుడైన అదానీ అక్రమాలు నెల రోజుల క్రితం వెలుగులోకి వచ్చినా , ప్రధాని పార్లమెంటులో కనీసం సమాధానం చెప్పేందుకు కూడా సిద్ధంగా లేకపోవడం, జాయింటు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటును అంగీకరించకపోవడం సిగ్గు చేటు అని కూనంనేని ధ్వజమెత్తారు.
ప్రీతి ఆత్మహత్య కారకులను వదిలిపెట్టొద్దు…. మహిళలను వేధించి హత్యలు, ఆత్మహత్యలను పురిగొల్పే సంస్కృతిని రూపుమాపాలి….
వరంగల్‌ పిజి వైద్య విద్యార్థిని ప్రీతిని ఆత్మహత్యకు పురిగొల్పిన వారిని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టొద్దని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మృత్యువుతో పోరాడి అసువులు బాసిన ప్రీతికి సంతాపం తెలియజేశారు. ఇప్పటికీ దేశంలో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌లు కొనసాగుడం దారుణమని, దీనికి విద్యార్థులు, మహిళలు బలికావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో దోషులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైతే చట్టాలను మార్చాలని, దోషులు మళ్ళీ కాలేజీకి వెళ్ళే అవకాశం లేకుండా చేయాలని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments