సా..గుతున్న వంతెనల పనులు
రాజధానిలోనే కాదు, జిల్లాల్లోనూ అంతంతగానే సాగుతున్న నిర్మాణ పనులు
ప్రజాపక్షం / హైదరాబాద్ ; రాష్ట్రంలో రోడ్డు బ్రిడ్జ్ వంతెనల పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆరు మాసాల నుండి ఏడాది కాలంలో పూర్తి చేయిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వాటి ఊసే ఎత్తడం లేదు. నిర్మాణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పజెప్పి చేతులు దులుపు కుంటుండడంతో కాంట్రాక్టర్లు చేసిన పనులకు డబ్బులు చెల్లించక పోతే ముందుకు కదిలేదెట్లా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నెలకొని ఉంది. రోడ్డు బ్రిడ్జ్ పనులు సాగుతున్న తీరు తెన్నులను అధికారులు తరుచూ తనిఖీలు చేయాల్సి ఉండగా ఆ పని జరగడం లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016 ఏడాదిలో తనిఖీలు ఓ మోస్తరుగా జరిగాయని, ఇప్పుడైతే ఎక్కడా తనిఖీల జోలికే వెళ్లడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు బిడ్జ్‌ల్ర పనులు ఏళ్లుగా సాగుతూ పోతే ఆ దారి గుండా వెళ్లే రాకపోకలకు తీవ్ర అంతరాయాలు తప్పడం లేదంటున్నారు. యూ టర్న్ కోసం ఏకంగా కిలోమీటర్లకు కిలోమీటర్ల దూరాన్ని దారి మళ్లిస్తుండడాన్ని ఈ సందర్భంగా వాహన చోదకులు గుర్తు చేస్తున్నారు.
రాజధానిలో సాగుతున్న ఎల్ బి నగర్ అండర్ పాస్ బ్రిడ్జ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఎల్‌బి నగర్ అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు గత రెండేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. నాగోల్ నుండి బైరామల్ గూడ వైపు వెళ్లేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్‌ఆర్‌డిపి ప్యాకెజి -2 కింద ఈ బ్రిడ్జ్ పనులు చేపట్టారు. 520 మీటర్ల పొడవునా భూసేకరణ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్‌ఎంసిని ఆదేశించగా.. వారు భూసేకరణను చేసి ఇచ్చారు. మెజార్టీగా కమర్షియల్ స్థలాలే ఇందులో ఉండడంతో భూసేకరణ పనులు తొలుత ముందుకు సాగలేదు. పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్థానిక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యులను పిలిచి తరుచూ సమీక్ష సమావేశాలను నిర్వహించడంతో వారు భూ యజమానులను అతికష్టం మీద ఒప్పించగలిగారు. దీంతో రూ. 18.55 కోట్ల అంచనా వ్యయంతో ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులు