ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ
కార్మిక, ఉద్యోగ, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడకుండా వెంటనే ఆర్‌టిసి కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని కార్మిక, ఉద్యోగ, రాజకీయ పార్టీల రౌండ్ టేండ్ సమావేశం డిమాండ్ చేసింది. ఆర్‌టిసీ సమస్యలపై కార్మిక, ఉద్యోగ సంఘాలు , రాజకీయ పార్టీల రౌండ్ టేండ్ సమావేశం బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాల్‌రాజ్ అ ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి పాలకులు మాట్లాడిన భాషకు నేడు కేసీఆర్ మాట్లాడుతున్న భాషకు ఏలాంటి తేడా లేదని చెప్పారు. తెలంగాణ సమాజంలో నియంత పాలనకు తావులేదని అలాంటి వారికి బుద్ధి చెప్పటానికి తెలంగాణ ప్రజలు ఎ ప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. సమ్మె విరమించి విధులో చేడానికి వచ్చే కార్మికులను అ డ్డుకోవటం నియంతృత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ అంత సులమైంది కాదని, అందుకు కేంద్ర అనుమతి అవసరమన్నారు. ఆర్‌టిసిని విధ్వంసం చేయడానికి ఏ చట్టం ఒప్పుకోదన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేసి నాటి ఆర్‌టిసీని లాభాల్లో నడిపించానని చెపుతున్నారని అయితే నేడు ముఖ్యమంత్రిగా ఆర్‌టిసీని ఎట్టిపరిస్థితుల్లోను ప్రభుత్వం భరించలేదని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బేషజాలకు పోకుండా కార్మికులందరిని విధుల్లోకి తీసుకోవాలని, ఆర్‌టిసీలో సామరస్య వాతావరణం కలుగజేయాలని కోరారు. సిపిఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల న రసింహరెడ్డి మాట్లాడుతూ ఆర్‌టిసీని ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేయటం లాంటిదని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను ఆర్‌టిసీని ప్రభుత్వ సంస్థగానే కోనసాగించాలని డిమాండ్ చేశారు. అందుకు కావాల్సిన కార్యాచరణ ప్రభుత్వమే నిర్ణయించాలని, కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే ఆర్‌టిసీని ప్రైవేటుపరం చేయటం, ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులపై కక్షగట్టి వారి ఉద్యోగాలు తొలగించడం కాదన్నారు, వెంటనే ఆర్‌టిసీ డిపోల వద్ద 144 సెక్షన్ ఎత్తివేసి ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. నవంబర్ 28, 29 తేదీలలో జరిగే రాష్ట్ర మంత్రివర్గం ఆర్‌టిసీ సమ్మెను కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చించాలని, ఆ వైపుగా బాధ్యతాయుతంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తండ్రిలా వ్యవహరించాలన్న కోర్టు చూసనలను పరిగణలోకి తీసుకొని కార్మికులకు న్యాయం చేసేలా చూడాలన్నారు. ఆర్‌టిసిపై చర్చించడానికి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలువాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.నరసింహన్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఐఎన్‌టియుసి నాయకులు విజయ్‌కుమార్ యాదవ్, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.కె.బోస్, కేంద్ర ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వి.నాగేశ్వర్‌రావు, ఇన్సూరెన్స్ నాయకులు గంగారాజు తదితరులు మాట్లాడుతూ ఆర్‌టిసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తులను కొంతమంది స్వార్థపరులకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.యస్.బోస్ ప్రవేశ పెట్టిన తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆర్‌టిసీ కార్మికులను బేషరతుగా విధులలోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని,ఆర్‌టిసి కార్మికుల బ కా యి జీతాలను వెంటనే చెల్లించాలని, ఆర్‌టిసి స్థలాల్లో నిర్మించిన పెట్రోల్ బంక్‌ల లీజుల ను రద్దు చేయాలని, ఆర్‌టిసి ఆస్తుల అమ్మకాలపై సిబిఐచే విచారణ చేయించి దోషులను శిక్షించాలని, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం క ల్పించాలనే తీర్మానాలను సమావేశం ఆమోదించింది. సమ్మెను విరమించి, విధుల్లో చేరుతామని ముందుకు వచ్చిన కార్మికులందనిపి బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని , నవంబర్ 28, 29 తేదీలలో జరిగే క్యాబినెట్ సమావేశాలలో చర్చించాలని మంత్రులకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు.