HomeNewsBreaking Newsతక్కువ అంచనా వేయొద్దు

తక్కువ అంచనా వేయొద్దు

సిపిఐకి జాతీయ హోదా రద్దు ప్రజాస్వామ్యంలో తగదు
ప్రజాపోరు యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ ఖమ్మం సిటీ / చింతకాని
దేశంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన సిపిఐని తక్కువ అంచ నా వేయడం బిజెపికి తగదన్నారు. ఇటీవల జాతీ య స్థాయిలో ఉన్న గుర్తింపును కావాలనే కుట్రపూరితంగా రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. కమ్యూనిస్టులతో కలిసి వచ్చే పార్టీలంతా ఏకమై బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు, రేపల్లేవాడ, ప్రొద్దుటూ రు, కోమట్లగూడెం, నాగిలిగొండ, నేరడ, చింతకాని, లచ్చగూడెం, రాఘవాపురం, కోదుమూరు, రామకృష్ణాపురం, బస్వాపురం, వందనం గ్రామా ల్లో కొనసాగింది. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభల్లో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మరోమారు అధికారంలోకి రావాలని కలలు కంటున్న మోడీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఇక నుంచి బిజెపికి రోజులు దగ్గర పడ్డాయని… వారి పాలన ఎవరి కోసం సాగిస్తున్నారో విజ్ఞులైన ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇదే విధానాలను అవలంబిస్తే మతతత్వ బిజెపికి తగిన బుద్ధి చెబుతామన్నారు. దేశ వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో బిజెపికో హఠావో – దేశ్‌ కో బచావో అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ ప్రజాపోరు యాత్రకు బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌సి తాతా మధుసూదన్‌ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఖమ్మంజిల్లా రాజకీయాల్లో కమ్యూనిస్టులకు ఎప్పుడు ప్రజలు తగిన ప్రాధాన్యతనిస్తూనే ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టులను తక్కువ చేసి మాట్లాడితే వారికి పుట్టగతులు ఉండవన్నారు. జిల్లాలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పొంగులేటి ధనబలాన్ని ప్రజాబలంగా భావించడం ఆయన అవివేకమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, కొండపర్తి గోవిందరావు, నాయకులు దొబ్బల వెంగళరావు, కొల్లి శ్రీనివాసరావు, అబ్బూరి మహేష్‌, పావులూరి మల్లికార్జునరావు, పగిడిపల్లి ఏసు, కూచిపూడి రవి, బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, ఎంపిపి కోపూరి పూర్ణయ్య, జెడ్పిటిసి తిరపతి కిషోర్‌, సిపిఎం మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments